అయిజ: ప్రముఖ సినీ దర్శకుడు అనిల్ రావిపూడి అయిజలో సందడి చేశారు. శనివారం తన మేనమామ ఆంధ్ర శేఖర్ ఇంట్లో బసచేసిన ఆయనను.. పలువురు మిత్రులు, బంధువులు మర్యాద పూర్వకంగా కలిశారు. త్వరలో కొత్త సినిమా చిత్రీకరిస్తున్న నేపథ్యంలో మంత్రాలయం గురు రాఘవేంద్ర స్వామిని దర్శించుకునేందుకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. తాను దర్శకత్వం వహించిన పటాస్, సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్–2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్–3, భగవంత్ కేసరి, సంక్రాతికి వస్తున్నాం, మన శంకరవరప్రసాద్ సినిమాల చిత్రీకరణకు ముందు మంత్రాలయం రాఘవేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు చేయించానని.. అన్ని సినిమాలు హిట్ అయ్యాయని చెప్పారు. ప్రతి సినిమా చిత్రీకరణకు ముందు మంత్రాలయం గురు రాఘవేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు చేయించడం సెంటిమెంట్ అని.. అది ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. త్వరలో కొత్త సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.


