మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న నిత్యానందచారికి ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–1 హోదాతో పదోన్నతి కల్పించింది. కౌకుంట్ల గ్రామానికి చెందిన నిత్యానందచారి 1993లో జూనియర్ అసిస్టెంట్‌గా దేవాదాయ శాఖలో సేవలు ప్రారంభించి, వివిధ హోదాల్లో సమర్థవంతంగా పనిచేస్తూ ఈ స్థాయికి చేరుకున్నారు. పదోన్నతి సందర్భంగా దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజుతో పాటు ఆలయ సిబ్బంది ఆయనను ఘనంగా సత్కరించి అభినందించారు. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నిత్యానందచారి మాట్లాడుతూ తనకు లభించిన పదోన్నతి పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ, సహచర ఉద్యోగులు, అధికారులు, భక్తుల సహకారంతోనే ఈ స్థాయికి చేరుకోగలికానని అన్నారు. భవిష్యత్‌లోనూ భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.


