కందనూలు: బిజినేపల్లి మండలంలోని నందివడ్డెమాన్‌లో శ్రీశనేశ్వరస్వామికి భక్తులచే శని గ్రహదోష నివారణకు స్వామివారికి తిలతైలా అభిషేకలు పూజలు భక్తితో వేదమంత్రోచ్ఛరణాల మధ్య ఘనంగా నిర్వహించారు. జేష్టమాత సమేత శనేశ్వరస్వామికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది భక్తులు ప్రత్యేకంగా తిలతైల అభిషేకాల పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి మాట్లాడుతూ జ్యేష్ఠ మాసంలో స్వామివారిని కొలిచిన అత్యధిక సంతృప్తి పొంది విశేష ఫలితాన్ని భక్తులకు ఇస్తారన్నారు. ప్రతి ఒక్కరు జన్మ, గోచార రీత్యా శనిగ్రహ దోష నివారణకు స్వామివారిని శక్తిమేరకు పూజించాలన్నారు. అనంతరం భక్తులకు వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాల, అల్పాహారం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఆలయ చైర్మన్ గోపాల్‌రావు, సర్పంచ్ సుగుణమ్మ, కమిటీ సభ్యులు రాజేష్, ప్రభాకరచారి, పుల్లయ్య పాల్గొన్నారు
బల్మూర్ ఎంపీడీఓ
రాఘవులు సస్పెన్షన్
బల్మూర్: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎంపీడీఓ రాఘవులు సస్పెన్షన్ చేస్తూ కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ అధికారులు ఎవరైన విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.
నూతన ఎంపీడీఓగా రేవతిరెడ్డి బాధ్యతలు
బల్మూర్ మండల నూతన ఎంపీడీఓగా అమ్రాబాద్‌లో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్న రేవతిరెడ్డిని నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వూలు అందజేశారు. ఈ మేరకు ఆమె శనివారం బాధ్యతలు స్వీకరించారు.


