పురుగుమందు తాగి మహిళ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

పురుగుమందు తాగి మహిళ ఆత్మహత్య

Jun 13 2026 1:11 PM | Updated on Jun 13 2026 1:11 PM

జడ్చర్ల: మండల పరిధిలోని నల్లకుంటతండా కు చెందిన సక్రిబాయి (53) శుక్రవారం పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ ఐ జయప్రసాద్‌ తెలిపారు. సక్రిబాయికి గత కొంత కాలంగా మతి స్థిమితం సరిగ్గా లేకపోవడం, తదితర అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది.ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగు మందు తాగగా కుటుంబసభ్యులు గమనించి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.మృతురాలి భర్త చందర్‌ ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

కుటుంబ కలహాలతో యువకుడి బలవన్మరణం

ఉండవెల్లి: మండలంలోని మారమునగాల–2 గ్రామానికి చెందిన చాంద్‌ బాషా (26) జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. చాంద్‌బాషా, షబానా దంపతుల కు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. కొద్ది నెలలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈనె 7న కూడా గొడవ జరగగా చాంద్‌ బాషా పురుగు మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే కర్నూలులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ శేఖర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రైలు పట్టాలు దాటుతూ వ్యక్తి మృతి

జడ్చర్ల: రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు కింద పడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే ఎస్‌ఐ రాజు తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు.. గురువారం జడ్చర్ల–గొల్లపల్లి రైల్వే స్టేషన్‌ల మధ్య గుర్తు తెలియని వ్యక్తి (50) రైలు పట్టాలు దాటుతుండగా అదే సమయంలో గూడ్సు రైలు రావడంతో అతడిని ఢీకొట్టింది. ప్రమాదంలో అక్కడికక్కడే మర ణించాడు. మృతుడి చేతిపై ఎల్లమ్మ అనే పేరు పచ్చబొట్టుగా ఉంది. మృతుడి గురించి తెలిసిన వాళ్లు ఎవరైనా ఉంటే 87126 58597 నంబరును సంప్రదించాలని ఎస్‌ఐ పేర్కొన్నారు.

పాన్‌షాప్‌లలో

విస్తృతంగా తనిఖీలు

మహబూబ్‌నగర్‌ క్రైం: జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో శుక్రవారం మాద క ద్రవ్యాలు, గుట్కాలు, పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించారు. కళాశాలలు, పాఠశాలల సమీపంలో ఉన్న పాన్‌ షాప్‌లు, ఇతర దుకాణాల్లో సోదాలు నిర్వహించారు. వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న దుకాణాల్లో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ అప్ప య్య ఆధ్వర్యంలో దుకాణాలు తనిఖీ గుట్కా లు, పొగాకు ఉత్పత్తులు, ఈ–సిగరేట్లను తదితర వాటిని పరిశీలించారు. ఆ తర్వాత దుకాణదారులకు, స్థానికులకు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పించారు.

ఖమ్మం ఘటనలో

నిందితుడికి శిక్ష విధించాలి

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ఖమ్మం జిల్లాలో నాలుగు రోజుల క్రితం ఓ 12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని గణేష్‌ భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాధితురాలి చికిత్సకు అయ్యే ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ నాయకులు ఎన్‌.లక్ష్మీనారాయణ, రాచాల జనార్దన్‌, లావణ్య, చాపల హనుమంతు, దర్శి గోవిందరెడ్డి, రెబ్బ విగ్నేష్‌, మిట్టె శ్రీశైలం, గుబ్బా భరత్‌ తదితరులు పాల్గొన్నారు.

డ్రంకెన్‌డ్రైవ్‌లో

8రోజుల జైలుశిక్ష

మహబూబ్‌నగర్‌ క్రైం: అధికంగా మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి న్యాయమూర్తి జైలు శిక్షతోపాటు జరిమానా విధించారు. టూటౌన్‌ పోలీసులు ఈనెల 8న నగరంలోని బోయపల్లి గేట్‌ దగ్గర చేసిన డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో చాకలిపల్లికి చెందిన తిరుపతయ్య అధికంగా మద్యం తాగి ద్విచక్రవాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. సదరు వాహనదారుడిని శుక్రవారం కోర్టులో హాజరు పర్చగా సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ శశిధర్‌ మద్యం తాగి పట్టుబడిన తిరుపతయ్యకు 7రోజుల జైలు శిక్షతోపాటు రూ.3 వేల జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. జరిమానా చెల్లించనందుకు మరోరోజు అదనంగా జైలు శిక్ష విధించారు. ఈ సందర్భంగా టూటౌ న్‌ సీఐ ఇజాజుద్దీన్‌ మాట్లాడుతూ.. ఇటీవల కాలంలో మద్యం తాగి వాహనాలు నడపడంతో ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోవడం, క్షతగాత్రులుగా మిగలడంతో జీవితాలు చిన్నాభిన్నం అవుతున్నాయని తెలిపారు. టూటౌన్‌ పరిధిలో నిత్యం డ్రంకెన్‌డ్రైవ్‌ తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement