కొత్తపల్లి (మద్దూరు): మద్దూరు పట్టణంలోని మూ డో వార్డులో వాటర్ ట్యాంక్ పైకప్పు గురువారం అర్ధరాత్రి ఒక్కసారిగా కుప్పకూలింది. ట్యాంక్‌ను 20 ఏళ్ల క్రితం నిర్మించగా పైకప్పు ఉన్నట్టుండి కూలిపోయినట్లు కాలనీవాసులు పేర్కొంటున్నారు. పై కప్పు కూలి వాటర్ ట్యాంక్‌లోనే పడిపోయినా అధికారులు మిషన్ భగీరథ నీటిని వాటర్ ట్యాంకులోకి అలాగే వదిలి కొళాయిలకు సరఫరా చేస్తున్నారని ఆ వేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ట్యాంక్ పైకప్పు కూలిన విషయాన్ని వార్డు కౌన్సిలర్ మౌనిక ప్రకాష్ దృష్టికి తీసుకెళ్లగా ఆమె పరిశీలించి కమిషనర్ శ్రీకాంత్‌కు తెలియజేయగా ట్యాంకులో కూలిపోయిన పైకప్పును సిబ్బందితో తొలగింపజేశారు. వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకోవడంతో ట్యాంకు కూడా ఏ క్షణంలోనైనా కూలిపోయే అవకాశం ఉందని, అధికారులు స్పందించి నూతన ట్యాంకును నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.


