నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష | - | Sakshi
Sakshi News home page

నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష

Jun 13 2026 1:11 PM | Updated on Jun 13 2026 1:11 PM

గద్వాల క్రైం: మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో పోక్సో కోర్టు న్యాయమూర్తి వి శ్రీనివాస్‌ శుక్రవారం నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమాన విధించినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అలంపూర్‌ మండలానికి చెందిన ఓ మైనర్‌ బాలికపై పింజరి పెద్దహుస్సేన్‌ అత్యాచారానికి పాల్పడాడ్డు. ఈ ఘటనపై 2021లో అలంపూర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖాలు చేశారు. అయితే కేసులోని సాక్షులను విచారించిన అనంతరం న్యాయమూర్తి నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార జైలు శిక్షతో పాటు రూ.20వేలు జరిమానా విధించారన్నారు. కేసు విచారణలో పోలీసు సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి నిందితుడికి శిక్షపడేలా చర్యలు తీసుకున్నారన్నారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు దోషిని మహబూబ్‌నగర్‌ జిల్లా జైలుకు తరలించారు.

యువకుడిపై పోక్సో కేసు నమోదు

నవాబుపేట: మండలంలోని కాకర్లపహడ్‌ గ్రామంలో మే నెలలో 16 ఏళ్ల బాలిక అదృశ్యం కావడంతో గ్రామానికి చెందిన యువకుడు సురేష్‌పై నవాబుపేట పోలీసులు కిడ్నాప్‌ కేసు నమోదు చేశారు.తాజాగా గురువారం బాలిక, యువకుడి ఆచూకీ గుర్తించి న పోలీసులు అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్‌ ఇచ్చారు. కాగా మైనర్‌ బాలికను పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా యువకుడిపై గతంలో ఉన్న కిడ్నాప్‌ కేసుతో పాటు శుక్రవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నరేందర్‌ తెలిపారు.

చికిత్స పొందుతూ విద్యార్థిని మృతి

ఉండవెల్లి: మండలంలోని ప్రాగటూరుకు చెందిన విద్యార్థిని బోయ చామంతి (17) చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. ఇంటర్‌ ఫలితాల్లో విద్యార్థిని గణితంలో ఫెయిల్‌ అయింది. సప్లిమెంటరీ రాయగా మళ్లీ ఫెయిల్‌ కావడంతో మనస్తాపానికి గురై గురువారం పురుగుమందు తాగింది. వాంతులు చేసుకోవడంతో తల్లి రామేశ్వరమ్మ గ మనించి చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందింది. తండ్రి బోయరాముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ వీరన్న తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement