జూరాలకు 2,388 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో | - | Sakshi
Sakshi News home page

జూరాలకు 2,388 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

Jun 12 2026 5:57 AM | Updated on Jun 12 2026 5:57 AM

ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి స్వల్పంగా ఇన్‌ఫ్లోలు కొనసాగుతుంది. స్థానికంగా కురుస్తున్న వర్షాల ఆధారంగా గురువారం సాయంత్రం వరకు ప్రాజెక్టుకు 2,388 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చిందని పీజేపీ అధికారులు తెలిపారు. దీంతో నెట్టెంపాడు ఎత్తిపోతలకు నీటి పంపింగ్‌ను చేస్తున్నారు. రెండు పంపులను రన్‌ చేసి గుడ్డెందొడ్డి, ర్యాలంపాడు రిజకర్వాయర్లను నింపుతున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతలకు 1,500 క్యూసెక్కులు, క్యూసెక్కులు ఆవిరి రూపంలో 43 క్యూసెక్కులు మొత్తం 1,543 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 3.572 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో దాదాపు 3 టీఎంసీల నీరు చేరినట్లు అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement