మహాకేఫ్‌తో ఎంతో లబ్ధి | - | Sakshi
Sakshi News home page

మహాకేఫ్‌తో ఎంతో లబ్ధి

Jun 12 2026 5:57 AM | Updated on Jun 12 2026 5:57 AM

15 ఏళ్లుగా మహిళా సంఘంలో సభ్యురాలి ఉన్నాను. ఈ క్రమంలోనే ఇటీవల టీఎల్‌ఎఫ్‌కు అధ్యక్షురాలిగా ఎన్నుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మూడు నెలల క్రితమే నాకు ఆర్‌అండ్‌బీ జంక్షన్‌లోని మహాకేఫ్‌ నిర్వహణ బాధ్యతలను మెప్మా అధికారులు అప్పగించారు. ఇందులో బేకరీ ఐటమ్స్‌తో పాటు వివిధ తిను బండారాలు, కూల్‌డ్రింక్స్‌ తదితరాలు అమ్ముతున్నాను. దీనికోసం సీ్త్రనిధి నుంచి రూ.మూడు లక్షలు రుణం తీసుకున్నాను. అలాగే నా వంతుగా రూ.1.50 లక్షలు పెట్టుబడి పెట్టాను. ప్రతిరోజూ ఖర్చులు పోను కనీసం రూ.వేయి ఆదాయం వస్తోంది.

– వందన, అధ్యక్షురాలు, నవభారత్‌ పట్టణ సమాఖ్య, మహబూబ్‌నగర్‌

టైలరింగ్‌తో ఉపాధి

నేను 12 ఏళ్లుగా మహిళా సంఘంలో సభ్యురాలిగా ఉంటున్నాను. మూడేళ్ల క్రితం ఇంటి వద్దే టైలరింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేసుకున్నాను. దీని కోసం మెప్మా ఆధ్వర్యంలో బ్యాంకు లింకేజీ, సీ్త్రనిధి ద్వారా రూ.లక్ష చొప్పున రుణం తీసుకున్నాను. క్రమం తప్పకుండా కిస్తీలు చెల్లిస్తూ వస్తున్నాను. ప్రస్తుతం ఈ బకాయిలు వూర్తి కావచ్చాయి. ఈ డబ్బులతో స్టిచ్చింగ్‌కు అవసరమయ్యే కుట్టు మిషన్లు 5 కొన్నాను. నాతో పాటు మా గ్రూపులోని మరో నలుగురికి ఉపాధి లభిస్తోంది. ఈ యూనిట్‌లో స్కూల్‌ యూనిఫాం కుట్టి ఇస్తున్నాం. ప్రైవేట్‌గా జాకెట్లు, మిడ్డీలు తదితరాలను కుడుతున్నాం. ఈ యూనిట్‌ ద్వారా మాకు ఎంతో లబ్ధి చేకూరుతోంది. – ఇమ్మడి సుమతి,

వైఎస్‌ఆర్‌ మహిళా సంఘం సభ్యురాలు, పాతతోట, మహబూబ్‌నగర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement