పోలీస్‌ సేవలు మరింత చేరువ చేస్తాం: ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ సేవలు మరింత చేరువ చేస్తాం: ఎస్పీ

Jun 12 2026 5:57 AM | Updated on Jun 12 2026 5:57 AM

మహబూబ్‌నగర్‌ క్రైం: డీజీపీ ఆదేశాల మేరకు ఇకపై జిల్లా ఎస్పీ కార్యాలయంలో పనిదినాల్లో ప్రతి రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండనున్నట్లు జిల్లా ఎస్పీ డి.జానకి ఒక ప్రకటనలో తెలిపారు. ఫిర్యాదుదారులు నేరుగా కలిసి ఫిర్యాదులు, వినతిపత్రాలు తదితర అంశాలను దృష్టికి తీసుకు రావచ్చునని తెలిపారు. అదేవిధంగా ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం కూడా ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండనున్నట్లు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించడంతో పాటు పోలీస్‌సేవలను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు వెల్లడించారు.

● అడ్డాకుల ఎస్‌ఐగా నూతనంగా బాధ్యతలు తీసుకున్న మురళి గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డి.జానకిని మర్యాదపూర్వకంగా కలిశారు. మురళి ఎస్‌ఐ ఉద్యోగం కంటే ముందు 18 ఏళ్ల పాటు భారత సైన్యంలో పని చేసి 2020లో తెలంగాణ పోలీస్‌ శాఖలో ఎస్‌ఐగా ఎంపిక అయ్యారు. ఇప్పటి వరకు మదనాపురం, మరికల్‌, కోదండపూర్‌లలో పని చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement