మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూని ర్సిటీ భౌతికశాస్త్రం విభాగంలో బేగరి ఉదయ్‌కుమార్ తన పరిశోధన పత్రాన్ని సమర్పించారు. ఈ మేరకు భౌతికశాస్త్ర అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రవీణ ఆధ్వర్యంలో ఆయన ‘సింథసిస్, క్యారెక్టరైజేషన్, డైలెక్ట్రిక్ ఆండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ రేర్ ఎర్త్ డోప్‌డ్ జింక్ ఫెర్రిటైట్స్’ అనే అంశంపై కొన్నేళ్లుగా విస్తృత ప్రయోగాలు చేశారు. ఇందుకు సంబంధించిన పరిశోధన పత్రాన్ని బీఓఎస్ చైర్మన్ జైపాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఓఎస్ నిర్వహించడంతో ఆయన పరిశోధన పూర్తయింది. ఈ సందర్భంగా ఉదయ్‌కుమార్‌ను పీయూ వీసీ శ్రీనివాస్ అభినందించారు.యూనివర్సిటీలో అ రుదైన అంశాలపై పరిశోధన చేయడం గొప్ప విషయమని, పరిశోధనల వల్ల యూనివర్సిటీతో పాటు విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరమ న్నారు. పరిశోధన రంగంలో ఇది ఒక కీలక పరిశోధనగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రర్ రమేష్‌బాబు, చెన్నయ్య పాల్గొన్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
భూత్పూర్: మండలంలోని చౌళ్లతండా వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పి.తవుర్య(49) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ చంద్రశేఖర్ తెలిపారు. పూర్తి వివరాలు.. ఖిల్లాఘణపురం మండలం ఈర్లతండాకు చెందిన తవుర్యా ఈ నెల 6న పత్తి విత్తనాలు కొనుగోలు కోసం మోటర్‌సైకిల్‌పై వెళ్తుండగా చౌళ్లతండా మలుపు వద్ద అదుపుతప్పి కిందపడటంతో తలకు, కాళ్లకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఎస్వీఎస్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అదే రోజు హైదరాబాద్‌లో వెల్‌నెస్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి భార్య బుజ్జి ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.


