పాముకాటుతో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

పాముకాటుతో మహిళ మృతి

Jun 11 2026 8:05 AM | Updated on Jun 11 2026 8:05 AM

దన్వాడ: పాముకాటుతో మహిళ మృతి చెందిన ఘటన మండలంలో బుధవారం చోటు చేసుకుంది. పూర్తి వివరాలు.. మండల కేంద్రానికి చెందిన బొక్కి తిరుపతమ్మ (56) ఇంటి వద్ద తెల్లవారుజామున పాముకాటుకు గురైంది. గమనించిన కుటుంబ సభ్యులు నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్‌ జిల్లా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

అగ్నికి ఆహుతైన ఇల్లు

ధరూరు: గ్రామానికి ఆనుకొని ఉన్న పంట పొలాల్లో వరికొయ్యలను అంటించగా నిప్పురవ్వలు ఎగిసిపడి ఓ ఇంటిపై పడి ఇల్లు దగ్ధమైన ఘటన మండల పరిధిలోని నెట్టెంపాడు గ్రామంలో చోటు చేసుకుంది. పూర్తి వివారలు.. బుధవారం గ్రామానికి ఆనుకొని పొలంలో వరికొయ్యలకు నిప్పంటించారు. రాత్రి వీచిన గాలులకు నిప్పరవ్వలు ఎగిసిపడి వెంకట్‌రెడ్డి అనే వ్యక్తి ఇంటిపై పడ్డాయి. దీంతో ఇంటి ముందు భాగంలో ఈతమట్టలు, ఈతవాట్లు ఇతర సామాగ్రి పూర్తి దగ్ధమయ్యాయి. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ ఇల్లు పూర్తిగా కాలిపోయిందని బాధితులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement