●పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి ఎదుట
8గంటలపాటు ఉద్రిక్తత
● చర్చలకు వచ్చి ముఖం చాటేసిన డాక్టర్ అసోసియేషన్ పెద్దలు
● బాలింత శవంతో భజనలు.. అర్ధరాత్రి వరకు చర్చలు.. చివరకు రాజీ
నారాయణపేట: ఓ మహిళ ప్రాణం పోయింది.. ఇద్దరు చిన్నారులు తల్లిని కోల్పోయారు.. ఓ కుటుంబం మానని విషాదంలో మునిగిపోయింది. చివరకు జరిగిన చర్చలన్నీ ఒకే సంఖ్య వద్ద ఆగిపోయా యి. అదే రూ.9.50 లక్షలు. నారాయణపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వద్ద సోమవారం రాత్రి 8గంటల నుంచి అర్ధరాత్రి 3:30గంటల వరకు కొనసాగిన పరిణామాలు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. మృతురాలు బాలింత నవనీత(25) మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. దాదాపు ఏడున్నర గంటలపాటు మృతదేహాన్ని అక్కడే ఉంచి భైటాయించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. శవంతో భజనలు చేస్తూ.. న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గేది లేదంటూ కుటుంబ సభ్యులు పట్టుబట్టడంతో ఆస్పత్రి యాజమాన్యంతోపాటు ప్రైవేట్ వైద్యవర్గాలపై తీవ్ర ఒత్తిడి ఏర్పడింది.
అసలేం జరిగింది?
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. నవనీత రెగ్యులర్ చెకప్ కోసం ఆస్పత్రికి వస్తూ ఉండేది. ప్రసవ సమయంలో పరిస్థితి విషమించడంతో వైద్యులు సిజేరియన్ చేశారు. దాదాపు 3గంటలపాటు కొనసాగిన శస్త్రచికిత్స అనంతరం పసికందును సురక్షి తంగా బయటకు తీశారు. అయితే ఆ తర్వాత నవనీతకు తీవ్రమైన రక్తస్రావం ఆగకపోవడంతో పరిస్థి తి క్లిష్టంగా మారింది. ఆమెకు పది యూనిట్ల వరకు రక్తం ఎ క్కించినట్లు సమాచారం. రక్తస్రావం నియంత్రణలో కి రాకపోవడంతో వైద్యులు మళ్లీ శస్త్రచికిత్స చేసి గర్భసంచిని తొలగించినట్లు కుటుంబ సభ్యు లు ఆ రోపిస్తున్నారు. అనంతరం నవనీత ఆరోగ్య పరిస్థితి మరింత విషమించిందని వైద్యులు చెప్పారు.
ఆస్పత్రి వాదన ఇదే..
మరోవైపు నవనీత ఆరోగ్య పరిస్థితి ముందే క్లిష్టంగా ఉందని కుటుంబ సభ్యులే తమకు చెప్పారని ఆస్ప త్రి వర్గాలు పేర్కొంటున్నాయి. ‘ప్రభుత్వ ఆ స్పత్రికి వెళితే పరిస్థితి చేయి దాటిపోతుంది.. మీరే ఎలా గైనా కాపాడాలని కుటుంబ సభ్యులు కోరడంతోనే తాము సిజేరియన్ చేశామని..అనంతరం రక్తం ఎ క్కించి ప్రాణాలు కాపాడేందుకు అన్ని ప్ర యత్నా లు చేశామని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నట్లు తెలిసింది.
రూ.55లక్షల డిమాండ్‌తో ప్రారంభమైన చర్చలు
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ప్రైవేట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రతినిధులు రంగంలోకి దిగారు. సో మవారం రాత్రి 11గంటల ప్రాంతంలో ప్రారంభమై న చర్చల్లో మృతురాలి కుటుంబ సభ్యుల తరఫున కొంతమంది పెద్దలు మొదట రూ.55లక్షల పరిహారం కోరినట్లు సమాచారం. మృతురాలి ఇద్దరు చిన్నారుల పేర్లపై చెరో రూ.20 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని, ఆస్పత్రికి ఖర్చు అయినా రూ.15లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
అర్థరాత్రి వరకు సాగిన రాజీ ప్రయత్నాలు
మొదట రూ.5లక్షల వరకు పరిహారం ఇవ్వడానికి సిద్ధమయ్యారని, అనంతరం చర్చలు నిలిచిపోగా.. మృతురాలి కుటుంబ సభ్యులు ససేమీరా అనడంతో రాత్రివేళల్లో మరో మధ్యవర్తిని రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది. ఒక పోలీసు అధికారి కూడా సంధానకర్తగా వ్యవహరించినట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. సుదీర్ఘ చర్చల అనంతరం రూ.9. 50లక్షల పరిహారంపై ఇరు వర్గాలు అంగీకరించినట్లు సమాచారం. అందులో భాగంగా రూ.లక్ష అడ్వాన్స్‌గాన అందజేసినట్లు విశ్వసనీయ సమాచారం. అనంతరం వారం రోజుల్లో మిగతా డబ్బు లు ఇచ్చేందుకు రాజీ కుదిరినట్లు తెలుస్తోంది.
చివరకు అంత్యక్రియలకు తరలింపు
రాజీ కుదరడంతో కుటుంబ సభ్యులు ఆందోళన విరమించి మతదేహాన్ని అంత్యక్రియల కోసం స్వగ్రామానికి తరలించారు. అయితే ఈ ఘటన జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో అత్యవసర వైద్య సదుపాయాల పరిస్థితిపై మరోసారి చర్చకు దారితీసింది.


