డ్రాగన్‌ ఫ్రూట్‌ తోట అగ్నికి ఆహుతి | - | Sakshi
Sakshi News home page

డ్రాగన్‌ ఫ్రూట్‌ తోట అగ్నికి ఆహుతి

Jun 10 2026 12:37 AM | Updated on Jun 10 2026 12:37 AM

– 10 లక్షల నష్టం

వనపర్తి రూరల్‌: గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో డ్రాగన్‌ ఫ్రూట్‌ తోట దగ్ధమైన ఘటన శ్రీరంగాపురం మండలంలోని తాటిపాములలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన అంకె బాలయ్య తనకున్న ఎకరన్నర పొలంలో డ్రాగన్‌ ఫ్రూట్‌ తోట సాగు చేశారు. సోమవారం రాత్రి తోట వద్ద ఉన్న గడ్డికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పట్టించడంతో తోటలో ఉన్న గడ్డికి మంటలు చెలరేగి తోటంతా మంటలు వ్యాపించి మొక్కలు దగ్ధమయ్యాయి. దీంతో సుమారు రూ.10 లక్షలు నష్టపోయినట్లు బాధిత రైతు వాపోయాడు. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని వేడుకున్నాడు.

భార్యకు వీడియో కాల్‌ చేసి భర్త ఆత్మహత్య

పహాడీషరీఫ్‌: ‘నేను చనిపోతున్నా.. నాకు బతకాలని లేదు’ అంటూ ఓ యువ కుడు భా ర్యకు వీడియో కాల్‌ చేసి, ఆత్మహత్య చేసుకున్న సంఘటన పహా డీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఊర్కొండ మండలం జకినాలపల్లికి చెందిన పెరుమాళ్ల నరేష్‌(37) జీహెచ్‌ఎంసీలో పనిచేస్తూ తుక్కుగూడలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి పదిహేనేళ్ల క్రితం శంషాబాద్‌కు చెందిన శ్రీలతతో వివాహం జరగగా ఇద్దరు కుమారులు ఉన్నారు. పది రోజుల క్రితం భార్యాభర్తలు గొడవ పడడంతో శ్రీలత తన పెద్ద కుమారుడిని తీసుకొని పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి తనతో పాటే ఉన్న చిన్న కుమారుడిని నరేష్‌ ఈనెల 8న భార్య వద్ద వదిలేసి వచ్చాడు. రాత్రి 12:30 గంటలకు శ్రీలతకు వీడియో కాల్‌ చేసి ‘నేను చనిపోతున్నా.. నాకు బతకాలని లేదు’ అని ఫోన్‌ కట్‌ చేశాడు. ఈ విషయాన్ని ఆమె నరేష్‌ మేనమామ రవీందర్‌కు చెప్పి, తుక్కుగూడకు వెళ్లి చూడగా అప్పటికే ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రవీందర్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement