కల్వకుర్తి రూరల్: పదో తరగతిలో 550కి పైగా మార్కులు సాధించిన 14 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మంగళవారం విద్యా స్వేచ్ఛ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో విమానం ఎక్కారు. వీరు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో పలు ప్రాంతాలను సందర్శించి తిరుగు ప్రయాణంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. విద్యార్థులతో పాటు ఫౌండేషన్ బాధ్యులు వాసుదేవ్, శేషగిరి ఉపాధ్యాయులు నిర్మల, శ్రీనివాసులు, రాధిక పలువురు విహారయాత్రకు వెళ్లినట్లు ఫౌండేషన్ సభ్యులు పేర్కొన్నారు.


