గ్రామీణ క్రీడాకారులకు అవకాశం కల్పిస్తాం | - | Sakshi
Sakshi News home page

గ్రామీణ క్రీడాకారులకు అవకాశం కల్పిస్తాం

Jun 10 2026 12:31 AM | Updated on Jun 10 2026 12:31 AM

భారత జట్టు మాజీ క్రికెటర్‌, హెచ్‌సీఏఆపరేషన్స్‌ హెడ్‌ అంబటి రాయుడు

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: జిల్లాలోని గ్రామీణ క్రీడాకారులకు భవిష్యత్‌లో మంచి అవకాశాలు కల్పిస్తామని భారత జట్టు మాజీ క్రికెటర్‌, హెచ్‌సీఏ ఆపరేషన్స్‌ హెడ్‌ అంబటి రాయుడు అన్నారు. జిల్లాకేంద్రం బోయపల్లి సమీపంలోని ఎండీసీఏ మైదానం జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతర్‌ జిల్లా అండర్‌–14, 16 వన్‌ డే క్రికెట్‌ టోర్నీ మంగళవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెచ్‌సీఏ నుంచి భారత జట్టుకు అధిక సంఖ్యలో క్రీడాకారులను ఎంపిక చేసేందుకు అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇప్పిస్తామన్నారు. గ్రామీణ క్రీడాకారులు భారత జట్టుకు ఆడాలన్నదే హెచ్‌సీఏ లక్ష్యం అన్నారు. ముఖ్యంగా క్రికెట్‌ అభివృద్ధికి, ఆట ప్రమాణాల పెంపునకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. హెచ్‌సీఏ కార్యదర్శి మన్నె జీవన్‌రెడ్డి మాట్లాడుతూ మొదటిసారిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ టీ–20 క్రికెట్‌ ప్రారంభం కానుందన్నారు. ప్రతి జట్టులో నలుగురు గ్రామీణ క్రీడాకారులకు అవకాశం కల్పిస్తామన్నారు. వచ్చే రెండేళ్లలో తెలంగాణ టీ–20 లీగ్‌ నుంచి రాష్ట్ర, జిల్లా క్రీడాకారులు భారత జట్టుతోపాటు ఐపీఎల్‌ తరపున ఆడ తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ క్రికెటర్లను తయారు చేసే కేంద్రంగా హైదరాబాద్‌ ను తీర్చిదిద్దుతామన్నారు. ఎండీసీఏ మైదానంలో ఫ్లడ్‌ లైట్లు, అకాడమీ ఏర్పాటుకు కృషి చేస్తామన్నా రు. అనంతరం ఉమ్మడి జిల్లా క్రికెట్‌ టోర్నీ అండర్‌ –14లో విజేతగా మహబూబ్‌నగర్‌, రన్నర్‌గా జడ్చ ర్ల, అండర్‌–16లో విజేతగా జడ్చర్ల, రన్నర్‌గా నిలిచిన మహబూబ్‌నగర్‌ బాలుర జట్లకు బహుమతు లు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎండీసీఏ చీఫ్‌ ప్యాట్రన్‌, న్యాయవాది మనోహర్‌రెడ్డి, కార్యదర్శి రాజశేఖర్‌, ప్రతినిధులు సురేష్‌కుమార్‌, వెంకటరామారావు, గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement