మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో భరోసా కల్పిస్తోందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మంగళవారం 80 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రెండున్నర ఏళ్లలో సుమారు మూడు వేల మందికి ఈ నిధి నుంచి ఆర్థికసాయం చేశామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలను పెంచుతూ, వైద్యులను నియమిస్తూ రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. అలాగే విద్య, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.
నాలెడ్జ్ సెంటర్ పనుల పరిశీలన..
అనంతరం నగరంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహం ప్రాంగణంలో నిర్మిస్తున్న పూలె–అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ పనులను నాణ్యతగా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పి.రామాంజులరెడ్డి, పబ్లిక్ హెల్త్ ఈఈ విజయభాస్కర్‌రెడ్డి, ఎంఈ మురళీమోహన్‌రెడ్డి, ముడా చైర్మన్ కె.లక్ష్మణ్‌యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్‌పర్పన్ బెక్కరి అనిత, నగర డిప్యూటీ మేయర్ ఎం.సురేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాములుయాదవ్, అజ్మత్‌అలీ, రఘు, శరత్, రమేష్‌నాయక్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.


