నిబంధనలు ఏం చెబుతున్నాయి.. | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు ఏం చెబుతున్నాయి..

Jun 9 2026 8:40 AM | Updated on Jun 9 2026 8:40 AM

డాదిన్నర క్రితం 185వ చట్టం క్లాజ్‌ (ఎఫ్‌) తర్వాత క్లాజ్‌ (జీ) ప్రకారం విద్యాసంస్థల బస్సుల కోసం అదనపు నిబంధనలు జోడించారు. స్కూల్‌ బస్సుపై కళాశాల/పాఠశాల పేరు, ఫోన్‌, సెల్‌ నంబర్లతో పాటు పూర్తి చిరునామాను బస్సు ఎడమవైపు, బస్సు ముందు భాగంలో స్పష్టంగా కనిపించేలా రాయాల్సి ఉంటుంది.

● 60ఏళ్లు దాటిన డ్రైవర్‌ను నియమించుకోరాదు. పాఠశాల యాజమాన్యం, బస్సు డ్రైవర్‌, బస్సుకు సంబంధించిన పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి.

● బస్సు డ్రైవర్‌ను నియమించే సమయంలో అతడి లైసెన్స్‌ను ఆర్టీఏ కార్యాలయంలో ఒకసారి సరిచూసుకోవడంతో పాటు బస్సును ఐదేళ్ల పాటు నడిపిన అనుభవం ఉండాలి. ● బస్సులో ఒక అత్యవసర ద్వారం ఉండాలి. దానిపై పెద్ద అక్షరాలతో అత్యవసర ద్వారం అని రాయాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement