బస్సులో తప్పనిసరిగా ఉండాల్సినవి.. | - | Sakshi
Sakshi News home page

బస్సులో తప్పనిసరిగా ఉండాల్సినవి..

Jun 9 2026 8:40 AM | Updated on Jun 9 2026 8:40 AM

● ప్రతి స్కూల్‌ బస్సులో అవసరమైన మందులు, పరికరాలతో కూడిన ప్రథ మ చికిత్స బాక్స్‌ ఉండాలి.

● బస్సులో తప్పకుండా ఒక అటెండర్‌ను ఉంచాలి. అతను తప్పనిసరిగా యూనిఫాం ధరించాలి.

● బస్సులో ప్రయాణిస్తున్న విద్యార్థుల పూర్తి వివరాలు ఉంచాలి. విద్యార్థి ఎక్కాల్సిన ప్రదేశం, దిగాల్సిన ప్రదేశం నమోదు చేయాలి.

● బస్సులో ఉన్న విద్యార్థులు కిందకు దిగే సమయంలో డ్రైవర్‌కు వారు కనిపించే విధంగా మిర్రర్‌ ఏర్పాటుచేయాలి.

● ముఖ్యంగా బస్సు ఇంజిన్‌ కంపార్ట్‌మెంట్‌లో అగ్నిమాపక పరికరం ఉండేలా చూసుకోవాలి.

● బస్సు సీట్ల కింద విద్యార్థుల బ్యాగులు పెట్టుకునేందుకు గాను ర్యాక్‌ ఉండాలి.

● బస్సు పాఠశాల కమిటీ పేరుమీద రిజిస్ట్రేషన్‌ అయి ఉండాలి.

● బస్సు తయారీ సంసవత్సరం నుంచి 15 ఏళ్లు మించరాదు

● ప్రతి బస్సుకు హ్యాండ్‌బ్రేక్‌, పూర్తిస్థాయిలో బీమా, రవాణా పన్నులు చెల్లించి ఉండాలి.

● బస్సు అద్దాలకు ఆనుకుని అడ్డంగా ఇనుప గ్రిల్స్‌ ఏర్పాటుచేయాలి.

● నాణ్యమైన ఇంజిన్‌, స్టీరింగ్‌, రూఫ్‌, టైర్లు తదితర ప్రభుత్వం గుర్తించిన పూర్తి సౌకర్యాలు కల్పించాలి.

● విద్యార్థులకు సౌకర్యవంతంగా ఉండేలా తక్కువ ఎత్తులో సీట్లు బిగించాలి.

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

ప్రైవేటు స్కూల్‌ బస్సులకు గడవులోపు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకోవాలి. లేనిచో రవాణాశాఖ ఆధ్వర్యంలో స్పెషల్‌ డ్రైవ్‌లు చేపట్టి.. నిబంధనలు పాటించని స్కూల్‌ బస్సులపై చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం ఫిట్‌నెస్‌ పరీక్షలకు వచ్చిన ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేసి.. ఫైర్‌ సేఫ్టీ, ప్రాథమిక చికిత్స బాక్స్‌, బస్సు బ్రేక్‌, కండీషన్‌ ఇలా ప్రతీది పరిశీలిస్తున్నాం. ఏదైనా బాగాలేకపోతే వెంటనే రిటన్‌ పంపిస్తున్నాం. కనీసం లైట్‌ లేకపోయినా సర్టిఫికెట్‌ ఇవ్వడం లేదు. అనుమతులు లేకుండా స్కూల్‌ బస్సులను నడిపితే కఠిన చర్యలు తప్పవు. అవసరమైతే బస్సుల డ్రైవర్లు, యాజమాన్యాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తాం.

– నర్సింహస్వామి, ఎంవీఐ, మహబూబ్‌నగర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement