మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: టీజీఆర్‌టీసీ మహబూబ్‌నగర్ రీజియన్ పరిధిలోని ఇద్దరు డిప్యూటీ ఆర్‌ఎంలతో పాటు ఆరుగురు డీఎంలు బదిలీ అయ్యారు. ఈ మేరకు తాజాగా సంస్థ ఎండీ నాగిరెడ్డి నుంచి ఉత్తర్వులు జారీ అయ్యా యి. ఇంతవరకు మహబూబ్‌నగర్‌లో డిప్యూటీ ఆర్‌ఎం (మెయింటెనెన్స్)గా పనిచేసిన కవిత హైదరాబాద్ లోని హయత్‌నగర్–1 డీవీఎంగా వెళుతున్నారు. ఆమె స్థానంలో జగన్ హైదరాబాద్‌లోని వర్క్‌షాపు నుంచి వస్తున్నారు. అలాగే ఇంతవరకు మహబూబ్‌నగర్‌లో డిప్యూటీ ఆర్‌ఎం (ఆపరేషన్స్) గా పనిచేసిన లక్ష్మీధర్మ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి డీవీఎంగా బదిలీ అయ్యారు. ఈయన స్థానంలో పరిగి డీఎంగా పనిచేస్తున్న కె.కె.మూర్తి పదోన్నతిపై ఇక్కడికి వస్తున్నారు. ఇక అచ్చంపేట డిపో మేనేజర్ (డీఎం) గా పనిచేస్తున్న ప్రసాద్ హైదరాబాద్‌లోని హయత్‌నగర్–2కు వెళుతున్నారు. ఈయన స్థానంలో హైదరాబాద్ నుంచి బి.శ్రీనివాసులు వస్తున్నారు. షాద్‌నగర్ డీఎంగా పనిచేస్తున్న ఉషా జనగామకు, ఈమె స్థానంలో హైదరాబాద్ నుంచి కరుణశ్రీ వస్తున్నారు. గద్వాల డీఎంగా పనిచేస్తున్న సునీత హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి, ఈమె స్థానంలో రాణిగంజ్ నుంచి ఎ.శ్రీధర్ వస్తున్నారు. నారాయణపేట డీఎంగా పనిచేస్తున్న లావణ్య హైదరాబాద్‌లోని హయత్‌నగర్–1కు, ఈమె స్థానంలో ఏటీఎం కార్గో నుంచి డీఎన్ రాజు వస్తున్నారు. కొల్లాపూర్ డీఎంగా పనిచేస్తున్న ఉమాశంకర్ హైదరాబాద్‌లోని హెడ్ ఆఫీసుకు, ఈయన స్థానంలో వరంగల్ బస్‌స్టేషన్ ఏటీఎం నుంచి మల్లేషం వస్తున్నారు. కల్వకుర్తి డీఎంగా పనిచేస్తున్న సుభాషిణి ఎల్లందుకు, ఈమె స్థానంలో హైదరాబాద్‌లోని డిప్యూటీ సీటీఎం–ఏఎంటీ షాలిని పదోన్నతిపై వస్తున్నారు.


