మా ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు పత్తి సాగు చేస్తారు. ఇప్పటికే విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేశాం. వర్షాలు సకాలంలో పడితే దిగుబడులు బాగుంటాయి. కానీ వర్షాలు ఆలస్యమైతే ఖర్చు లు పెరుగుతాయి. మృగశిర కార్తె రైతులకు ఆశల కాలం. – నర్సింహులు, ఉడ్మల్‌గిద్ద,
దామరగిద్ద మండలం
మృగశిర కార్తె మొదలైన రోజు దగ్గరపడగానే పల్లెల్లో ఒక కొత్త వాతావరణం మొదలవుతుంది. వరణుడి కోసం రైతు చూపు పెరుగుతుంది. మృగశిర కార్తెలో విత్తనం నేలలో పడితే దిగుబడి ఆశించిన మేర వస్తుంది.
– కృష్ణయ్య, రాకొండ, మరికల్ మండలం
మృగశిర కార్తె అంటే రైతుకు కేవలం పంచాంగంలో ఒక పేరు కాదు. అది వానాకాలం సీజన్‌కు ప్రధాన ముఖద్వారం. కార్తె వచ్చిందంటే అన్నదాతకు ఆశలు చిగురిస్తాయి. ఈపాటికే సిద్ధం చేసుకున్న దుక్కులు తొలకరి జల్లు కోసం ఎదురుచూస్తున్నాయి. సరైన సమయంలో వర్షం పడిదంటే రైతులకు పండగే.
– ఎల్లప్ప, మాద్వార్, మక్తల్ మండలం
కార్తె ప్రారంభం నాడు చేపలు తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి ఏడాదంతా ఆరోగ్యంగా ఉంటామని విశ్వాసం. మిరియాలు, అల్లం, శొంఠి తింటే వర్షాల నుంచి వచ్చే చల్లని గాలులతో సోకే జ్వరం, జలుబు వంటి రోగాలు దరిచేరకుండా రక్షణనిస్తాయి.
– నామాల వెంకటయ్య, మరికల్
●


