తుఫాన్‌ ఢీకొని 15 గొర్రెలు మృతి | - | Sakshi
Sakshi News home page

తుఫాన్‌ ఢీకొని 15 గొర్రెలు మృతి

Jun 7 2026 9:00 AM | Updated on Jun 7 2026 9:00 AM

ఎర్రవల్లి: జాతీయ రహదారిపై తుఫాన్‌ వాహనం ఢీకొని 15 గొర్రెలు మృతి చెందిన ఘటన ఇటిక్యాల పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన శివ శనివారం జాతీయ రహదారిపై కొండేరు సమీపంలో గొర్రెల గుంపును రోడ్డు దాటిస్తున్నాడు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న ఓ తుఫాన్‌ వాహనం అతివేగంతో గొర్రెల గుంపును ఢీకొట్టడంతో 15 గొర్రెలు మృతి చెందగా మరికొని తీవ్రంగా గాయపడ్డాయి. వాటి విలువ సుయారు రూ.2.50 లక్షలు ఉంటుందని బాధితుడు బోరున విలపించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు తుఫాన్‌ డ్రైవర్‌ గిర్వార్‌ సింగ్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement