పెరటిలో అక్షయ సంజీవని | - | Sakshi
Sakshi News home page

పెరటిలో అక్షయ సంజీవని

Jun 7 2026 9:00 AM | Updated on Jun 7 2026 9:00 AM

రామన్‌పాడులో పచ్చని విప్లవం!

ఆయుర్వేద వనంగా శ్రీధర్‌రెడ్డి పెరడు

ప్రకృతి ఒడిలో వ్యాధులకు విరుగుడు

సేంద్రియ సాగుతో నేటితరానికి ఆరోగ్యబాట

మదనాపురం: నేటి యాంత్రిక జీవనంలో ఆరోగ్య సమస్యలు పెరిగిపోతున్న వేళ ప్రకృతిని నమ్ముకుంటేనే శాశ్వత పరిష్కారం దొరుకుతుందని చాటి చెబుతున్నారు రామన్‌పాడుకు చెందిన శ్రీధర్‌ రెడ్డి. తన ఇంటి ఆవరణను ఒక చిట్టి ఆయుర్వేద వనంగా మార్చి, వందలాది మందికి ఆరోగ్య ప్రదాతగా నిలుస్తున్నారు. రసాయనాలతో నిండిన ఆహారం కల్తీ మందులకు దూరంగా స్వచ్ఛమైన ఆయుర్వేద మొక్కల పెంపకంలో ఆయన చేస్తున్న కృషి ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

● సభావ్‌ స్నేక్‌ గ్రాస్‌ ప్లాంట్‌, ప్రొస్టేడ్‌ గ్రంది నియంత్రణకు, క్యాన్సర్‌, లివర్‌ తదితర సమస్యలకు పనిచేస్తుంది. రణపాల మూత్రపిండాల సమస్యల నివారణ, లక్ష్మణ ఫలం క్యాన్సర్‌ కణాలను ఎదుర్కోవడంలో కీలకం. వీటితోపాటు పారిజాతం, రుద్రాక్ష, తెల్లేశ్వరి, లక్ష్మితార వంటి అరుదైన మొక్కలు తోటలో సందర్శకులను ఆకర్షిస్తున్నాయి.

2018లో మొదలైన అడుగు నేడు ఆయుర్వేద ధామం

2018లో కేవలం మొక్కలపై ఉన్న మక్కువతో మొదలైన ఆయన ప్రయాణం నేడు ఒక గొప్ప సేవా కార్యక్రమంగా రూపుదిద్దుకుంది. దేశవ్యాప్తంగా పర్యటిస్తూ మహారాష్ట్ర, ఒరిస్సా, చత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక వంటి రాష్ట్రాలకు వెళ్లి, అరుదైన విశిష్టమైన ఆయుర్వేద మూలికలను సేకరించి తన పెరటిలో నాటారు. నేడు తోటలో సుమారు 20నుంచి 30రకాల అత్యంత విలువైన ఆయుర్వేద మొక్కలు అలరారుతున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement