దత్తతకు పారదర్శక విధానం అమలు | - | Sakshi
Sakshi News home page

దత్తతకు పారదర్శక విధానం అమలు

Jun 7 2026 8:54 AM | Updated on Jun 7 2026 8:54 AM

సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ అథారిటీ (కారా) ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దత్తత ప్రక్రియను పారదర్శక విధానంలో నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌ శిశుగృహలో 22 మంది పిల్లలను దత్తత ఇచ్చేందుకు అధికారులు సన్నద్ధమవుతుండగా 66 మంది దంపతులు దత్తత కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ మొదలుకుని దత్తత కోరుకునే జంటలకు పిల్లలను అప్పగించడం వరకు అన్ని ప్రక్రియలను ఆన్‌లైన్‌ విధానంలోనే సీ్త్ర, శిశు సంక్షేమశాఖ నిర్వహిస్తుంది. దరఖాస్తు చేసుకున్న తేదీ నుంచి జాబితాలో సీనియారిటీ ప్రకారం చట్టపరమైన జాగ్రత్తలు పాటిస్తూ పిల్లలను దత్తత ఇస్తున్నారు. దత్తతకు వెళ్లిన పిల్లలు తాము వెళ్లిన చోట ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నారా లేదా తెలుసుకునేందుకు రెండేళ్ల పాటు సంబంధిత శాఖ పర్యవేక్షిస్తుంది. దత్తతకు వెళ్తున్న వారిలో ఆడ పిల్లల సంఖ్యే ఎక్కువగా ఉండటం విశేషం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement