● మూడు నెలల్లో పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయకుంటే పోరాటమే
● మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పూర్తిచేయాలనే ఉద్దేశంతో బీఆర్‌ఎస్ తలపెట్టిన పాదయాత్ర ప్రకటనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉలిక్కిపడిందని మాజీ మంత్రి, జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం పార్టీ కా ర్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రెండున్నరేళ్లయినా పాలమూరు ప్రాజెక్ట్‌పై ప్రభుత్వానికి చల నం లేదని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు పాదయాత్ర చేస్తామని ప్రకటన చేయగానే ముఖ్యమంత్రి పర్యటనలు, సమీక్షలు, మంత్రుల పర్యటన ప్రా రంభించారన్నారు. ప్రభుత్వం అనుకున్న రీతిలో పనులు చేయకుంటే పాదయాత్ర చేపడుతామన్నా రు. మేము ప్రాజెక్టు పూర్తి చేస్తే తుది మెరుగులు ది ద్దేందుకు ఏడాది పడుతది అంటున్నారన్నారు. ప్రా జెక్టు పూర్తి చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో సీఎం స్పష్టంగా చెప్పలేదని ఆరోపించారు.
● పాదయాత్ర చేస్తామంటే ప్రభుత్వం భయపడి సీఎం రేవంత్‌రెడ్డి పాలమూరు ప్రాజెక్ట్‌ను సందర్శించి 6 నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించారని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. 90 శాతం పనులు పూర్తయిన పాలమూరు ఎత్తిపోతల పనులు మూడునెలల్లో పూర్తి చేయాలని లేకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ీసీఎం రెండురోజుల పర్యటనలో జిల్లాకు ఒరిగిందేమి లేదని, ఏదైనా వరాలు కురిపిస్తారని ప్రజలు ఆశించారని విమర్శించారు. నిలిచిన పనులు పూర్తి చేసేందుకు నిధులు ఇవ్వకుండా బీఆర్‌ఎస్‌పై విమర్శించడానికే ప్రాజెక్టుల సందర్శన పెట్టుకున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. ‘పాలమూరు’ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తామో కూడా స్పష్టంగా చెప్పలేదని ఆరోపించారు. జూరాల పరిధిలో చెక్ డ్యామ్ కట్టేందుకు ఏరియల్ సర్వే రేవంత్‌రెడ్డి చేశారని, కర్ణాటక వైపు వెళ్లిండు అక్కడ పనులు చెక్ డ్యామ్‌లు చూసిండని దాంతో తెలంగాణకు ఒరిగిందేమి లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేవలం కేసీఆర్‌ను తిట్టడానికి ప్రజాధనం ఖర్చు చేశారన్నారు. ప్రాజెక్ట్‌ల వారీగా ఎంత పని అయింది, మిగిలిన పనులు ఎప్పుడు చేస్తారో జిల్లా పర్యటనలో చెప్పలేదని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వ సమయంలోనే పంట ఎక్కువ పెరిగిందన్నారు. కేసీఆర్ సాగునీరు ఇవ్వడంతోనే సాధ్యమైందన్నారు. అనంతరం పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పనులు ఎంతవరకు పూర్తిచేశారో వివరిచే చిత్రాలను విడుదల చేశారు. సమావేశంలో మాజీ ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, అంజయ్య, నాయకులు వాల్యానాయక్, ఇంతియాజ్ ఇసాక్, శ్రీనివాస్ యాదవ్, యాదయ్య, రాజేశ్వర్‌గౌడ్, వెంకన్న, నర్సింహులు పాల్గొన్నారు.


