భయపెడుతున్న పెద్దపులి | - | Sakshi
Sakshi News home page

భయపెడుతున్న పెద్దపులి

Jun 6 2026 1:35 AM | Updated on Jun 6 2026 1:35 AM

అమ్రాబాద్‌: పెద్దపులిదాడిలో మరో పాడి గేదె మృతి చెందిన ఘటన శుక్రవారం పదర మండలం ఇప్పలపల్లి గ్రామశివారులోని పెద్దగూడెపంపు అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఇప్పలపల్లి గ్రామానికి చెందిన బిలావత్‌ తావుర్యానాయక్‌ చెందిన పాడిగేదె గ్రామ శివారులోని పెద్దగూడెపంపు అటవీలో మేతకు వెళ్లగా పెద్దపులి దాడిచేసి చంపేసిందని గ్రామస్తులు తెలిపారు. బాధిత రైతు తావుర్యా సమాచారంతో ఎఫ్‌బీఓ రవీందర్‌ సిబ్బందితో వెళ్లి పంచనామా నిర్వహించారు. అయితే అదే గ్రామమైన ఇప్పలపల్లి గ్రామానికి చెందిన అల్లు రామకృష్ణారెడ్డి గేదె పెద్దపులి దాడిలో మృతి చెందగా శుక్రవారమే మరో గేదె పెద్దపులి దాడిలో మృతి చెందడంతో పశువుల పెంపకందారులు, స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

పులి దాడిలో మరో పాడిగేదె మృతి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement