వాగు వద్దకే మా ప్రయాణం | - | Sakshi
Sakshi News home page

వాగు వద్దకే మా ప్రయాణం

Jun 6 2026 1:35 AM | Updated on Jun 6 2026 1:35 AM

మాగనూర్‌: మండలంలో నడుస్తున్న ఇసుక రీచ్‌లతో అటు ప్రజలు.. ఇటు విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం పైచదువుల కోసం ఆధాయ, కుల ధ్రువపత్రాల కోసం మాగనూర్‌ తహసీల్దార్‌ కార్యాలయానికి వస్తున్న విద్యార్థులకు సంబంధిత అధికారులు అందుబాటులో ఉండడంలేదని వాపోతున్నారు. చివరికి అత్యవసరమైతే విద్యార్థులు వాగుల వద్దకు చేరుకుని అక్కడ పత్రాలను నింపుతున్నారు. దీంతో సమయంతోపాటు అదనపు ఖర్చులవుతున్నాయని వాపోతున్నారు. ఇదే విషయంపై సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికై నా అధికారులు జీపీవోలకు ఇసుక రీచ్‌ల దగ్గర డ్యూటీలు వేయకుండా ఉండాలని పలువురు కోరుతున్నారు. అయితే ప్రస్తుతం నియోజకవర్గంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు సగానికి పైగా పూర్తయ్యాయని, మిగతావి కూడా 80శాతం కుపైగా నిర్మాణ దశలో ఉన్న ఇప్పటికీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇన్ని ట్రాక్టర్లకు అనుమతులు ఎలా పొందుతున్నారని ఆయా గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కావున అధికారులు స్పందించి అర్హులైనవారికి మాత్రమే అనుమతులివ్వాలని కోరుతున్నారు.

నిప్పంటిచుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

తిమ్మాజిపేట: భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగా ఓ వ్యక్తి నిప్పంటించుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మండలంలోని గుమ్మకొండలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివారలు.. ధన్వాడ గ్రామానికి చెందిన తిమ్మయ్య భార్య లక్ష్మి గ్రామ సమీపంలో ఓ ప్రైవేట్‌ కంపెనీలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం రాత్రి భార్యాభర్తల మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఈ క్రమంలో క్షణికావేశంలో తిమ్మయ్య డీజిల్‌ ఒంటిపై పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి మంటలు ఆర్పివేసి చికిత్స నిమిత్తం మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇసుక ట్రాక్టర్‌ పట్టివేత

మిడ్జిల్‌: వుండలంలోని కొత్తపల్లి సమీపంలోని దుంధుబీ వాగు నుంచి శుక్రవారం అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకొని పోలీసుస్టేషన్‌కు తరలించినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు. తిమ్మాజిపేట్‌ మండలంలోని ఆర్సీ తండాకు చెందినదిగా గుర్తించి ట్రాక్టర్‌ డ్రైవర్‌ రాహుల్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

ఆదాయ, కుల ధ్రువపత్రాలకు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

ఇసుక రీచ్‌ల వద్ద జీపీవోల డ్యూటీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement