కాజీపేట రూరల్: కాజీపేట రైల్వే క్రూ బుకింగ్ లాబీ బలోపేతం అవుతుంది. ఇటీవల సికింద్రాబాద్ రైల్వే అధికారులు లోకో పైలెట్లు, అసిస్టెంట్ లోకో పైలెట్ల పోస్టింగుల్లో 121 మంది స్టాఫ్‌కు కాజీపేట క్రూలాబీకి మంజూరు చేశారు. కొంత కాలంగా నుంచి క్రూ లింక్‌ల తరలింపు, కుదింపు, నిర్వీర్యం సమస్యలతో సతమతువుతున్న కాజీపేట లోకో రన్నింగ్‌స్టాఫ్‌కు 121 మంది పోస్టింగ్ కొంత ఊరటనిచ్చిందని రైల్వే నాయకులు చెబుతున్నారు. అసిస్టెంట్ లోకో పైలెట్ల కేటగిరీ విభాగం బదిలీల్లో 47 మంది, మెయిల్ ఎక్స్‌ప్రెస్ పదోన్నతుల్లో ఐదుగురు లోకోపైలెట్లు, ప్యాసింజర్ లోకోపైలెట్ల పదోన్నతిలో ఏడుగురు, రిక్వెస్ట్ ట్రాన్స్‌ఫర్లలో 9 మంది ప్యాసింజర్ లోకోపైలెట్లు, గూడ్స్ లోకోపైలెట్ల బదిలీల్లో 24 మంది, పోస్టింగ్‌లో గూడ్స్ లోకోపైలెట్లు నలుగురు, పోస్టింగ్‌లో లోకోపైలెట్ షంటర్స్ 25 మందికి పోస్టింగ్ ఆర్డర్స్ దశల వారీగా ఇచ్చినట్లు కాజీపేట రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ లోకో రన్నింగ్ బ్రాంచ్ సెక్రటరీ పాక రాజ్‌కుమార్ శనివారం తెలిపారు. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ జనరల్ సెక్రటరీ డాక్టర్ మర్రి రాఘవయ్య, సికింద్రాబాద్ డివిజన్ రైల్వే సంఘ్ అధ్యక్ష కార్యదర్శులు కొత్త మురళీకృష్ణ, జి.ప్రభురాజ్ కృషి ఫలితంగా 121 మంది పోస్టులు కాజీపేట లాబీకి మంజూరైనట్లు రాజ్‌కుమార్ తెలిపారు.
121 మంది రన్నింగ్‌స్టాఫ్‌కు పోస్టింగ్


