
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి
పాలకుర్తి టౌన్: సేంద్రియ వ్యవసాయ విధానంపై రైతులకు అవగాహన కల్పించి ప్రోత్సహించాలని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి అన్నారు. గురువారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల, తొ ర్రూరు, పెద్దవంగర, రాయపర్తి మండలాలకు చెందిన వ్యవసాయశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. సేంద్రియ వ్యవసాయంతోనే మానవ మనుగడ సాధ్యమని, అఽత్యధికశాతం ఈ దిశగా అవగాహన కల్పించి రైతులను ప్రోత్సహించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని చెప్పారు. ప్రతీ గ్రామంలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. సమావేశంలో జనగామ డీఏఓ రామారావునాయక్, ఏడీఏ అజ్మీరా పరశురాంనాయక్, ఏఓలు శరత్‌చంద్ర, దివ్య, విజయ్‌రెడ్డి, వీరభద్రం, రామనర్సయ్య పాల్గొన్నారు.
పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి