
రౌడీషీటర్ దారుణ హత్య
● ఆర్థిక లావాదేవీలే కారణం..
● పోలీసుల అదుపులో నిందితులు
● నిందితుల్లో ఓ మాజీ పోలీస్ కానిస్టేబుల్..
వరంగల్ క్రైం : నగరంలోని వడ్డేపల్లికి చెందిన రౌడీషీటర్ మహ్మద్ సాధిక్ హుస్సేన్(48) దారుణ హ త్యకు గురయ్యాడు. ఈ ఘటన బుధవారం రాత్రి సుబేదారి పీఎస్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ ఎం.రంజిత్‌కుమార్ కథనం ప్రకారం.. మహ్మద్ సాధిక్ హుస్సేన్ తన పెద్దనాన్న కొడుకు ఖాదర్ హుస్సేన్‌కు రూ. 3 లక్షలు అప్పు ఇచ్చాడు. ఇందులో రూ. లక్ష ఇచ్చిన అనంతరం ఖాదర్ హుస్సేన్ మృతి చెందాడు. దీంతో సాధిక్ హుస్సేన్ తన మిగతా డబ్బులు తిరిగి ఇవ్వాలని ఇటీవల ఖాదర్ హు స్సేన్ కుమారులు మహ్మద్ సోహెల్, మహ్మద్ బషీర్‌ను అడిగాడు. దీంతో బుధవారం రాత్రి సాధిక్ హుస్సేన్ ఇంటికెళ్లిన మహ్మద్ సోహెల్, మహ్మద్ బషీర్.. మాట్లాడాలని సాధిక్ హుస్సేన్‌ను శ్మశాన వాటిక దగ్గరకు తీసుకొచ్చి మరో నిందితుడు అక్రమ్‌తో కలిసి హత్య చేశారు. సా ధిక్ హుస్సేన్‌ను హత్య చేస్తే డబ్బులు అడిగే వారు ఎవరూ ఉండరనే కారణంతో ఇంటి నుంచి తీసుకొచ్చి బండరాయితో మోది హత్య చేశారు. నిందితుల్లో అక్రమ్ గతంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించి ఓ హత్యకేసులో నిందితుడిగా ఉండడంతో సర్వీస్ నుంచి తొలగించినట్లు ఇన్‌స్పెక్టర్ పేర్కొన్నారు.మృతుడి చెల్లి తస్లీమా బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
పోలీసుల అదుపులో నిందితులు?
రౌడీషీటర్ మహ్మద్ సాధిక్ హుస్సేన్ హత్య కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్ సోహెల్, మహ్మద్ బషీర్, మహ్మద్ అక్రమ్ పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలిసింది. సాధిక్ హుస్సేన్ హత్య విషయం తెలిసి న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న సుబేదారి ఇన్‌స్పెక్టర్ రంజిత్‌కుమార్ ఎదుట నిందితులు నేరుగా వచ్చి నేరం అంగీకరించి లొంగిపోయినట్లు తెలిసింది. పోలీసులు మాత్రం ధ్రువీకరించలేదు.