భవిష్యత్తు వైఎస్సార్‌సీపీదే | - | Sakshi
Sakshi News home page

భవిష్యత్తు వైఎస్సార్‌సీపీదే

Jun 15 2026 1:47 AM | Updated on Jun 15 2026 1:47 AM

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి

చిప్పగిరి: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, అన్ని పార్టీ నాయకులు వైఎస్సార్‌సీపీ వైపు చూస్తున్నారని ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి అన్నారు. భవిష్యత్‌ వైఎస్సార్‌సీపీదే అని తెలిసి పార్టీ లో చేరుతున్నారని చెప్పారు. దేవనకొండలోని 20 కుటుంబాలు, కుంకనూరు గ్రామానికి చెందిన 10 కుటుంబాలు లోక్‌సత్తా పార్టీ నుంచి ఆదివారం వైఎస్సార్‌సీపీలోకి చేరాయి. ఈ సందర్భంగా చిప్పగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బుసినె విరూ పాక్షి వారిని పార్టీ కండువా వేసి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎన్నికల్లో సుపర్‌ సిక్స్‌ హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన చంద్రబాబు వాటిని అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. కూటమి రెండేళ్ల పాలనలో స్కాములు, అప్పులు, మోసాలు తప్ప ఏమీలేదన్నారు. చివరకు డీఎస్సీలో కూడా అక్రమాలకు పాల్పడి డబ్బులు వసూలు చేసే స్థాయికి దిగజారారని మండి పడ్డారు. చంద్రబాబు పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. అన్ని రంగాల్లో అధోగతి పాలైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టే సత్తా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మాత్రమే ఉందన్నారు. అధికార పార్టీ చేస్తున్న మోసాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు వివరించాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన వారిలో దేవనకొండ మండలం నుంచి లోక్‌సత్తా ఆదోని డివిజన్‌ ఇన్‌చార్జ్‌ చాకలి శేఖర్‌, లోక్‌ సత్తాపార్టీ నాయకులు ఓబులేసు, రంగన్న, నాగరాజు, వీరేష్‌, పెరవలయ్య, ప్రసాద్‌, రమేష్‌, బైరవకుంట చంద్రబాబు, దొర స్వామి, గుండు వీరాంజనేయ, శ్రీను తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement