ఆస్పరి: భారీ వర్షాలకు యాటకల్లు సమీపంలో ఉన్న బ్రిడ్జి తెగిపోయింది. దీంతో యాటకల్లు, తొగలుగల్లు, దొడగొండ, తురువగల్లు, ఐనకల్లు, కై రుప్పల, కారుమంచి గ్రామాల నుంచి ఆస్పరికి ఎమ్మిగనూరు వెళ్లేందుకు రాకపోకలు నిలిచిపోయాయి. గత ఏడాది వర్షాలకు ఈబ్రిడ్జి తెగిపోయింది. యాటకల్లు పంచాయితీ వారు తాత్కాలికంగా గరసు వేసి రాకపోకలు వచ్చేలా చేశారు. ప్రస్తుతం భారీ వర్షానికి తెగిపోవడంతో మండల కేంద్రమైన ఆస్పరికి, ఎమ్మిగనూరుకు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆయా గ్రామాల ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. శాశ్వతంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి జిల్లా కలెక్టర్‌కు స్వయంగా వెళ్లి చెప్పినా పట్టించుకోలేదు. ఇప్పటికై నా అధికారులు శాశ్వతంగా యాటకల్లు బ్రిడ్జి నిర్మించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


