కర్నూలు(టౌన్): కర్నూలు డీఎస్పీగా కె.వి.రాఘవేంద్ర శనివారం సాయంత్రం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఆయన 1996 సంవత్సరంలో ఎస్‌ఐగా పోలీసు శాఖలో చేరారు. 2010 సంవత్సరంలో సీఐగా పదోన్నతి పొందారు. గత నెల మే 1న డీఎస్పీగా పదోన్నతి రావడంతో ఆయన ఇక్కడ బాధ్యతలు చేపట్టారు. ఎక్కువ కాలం ఎస్‌ఐగా, సీఐగా ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాలో పనిచేశారు. బాధ్యతల అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ తొలిసారిగా కర్నూలు జిల్లాకు రావడం ఆనందంగా ఉందన్నారు. కర్నూలు సబ్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానన్నారు.


