రక్తదాతలు..ప్రాణదాతలు | - | Sakshi
Sakshi News home page

రక్తదాతలు..ప్రాణదాతలు

Jun 14 2026 7:16 AM | Updated on Jun 14 2026 7:16 AM

రక్తదానం ఎవరు చేయవచ్చంటే... రక్తదాతలకు నేడు సన్మానం 89 సార్లు రక్తదానం చేశాను

ఆరేళ్లుగా రక్తదానం వివరాలు

ఐదేళ్లలో రెండున్నర లక్షల మంది రక్తదానం

జిల్లాలో 13 బ్లడ్‌ బ్యాంకులు,

5 బ్లడ్‌ స్టోరేజ్‌ కేంద్రాలు

నేడు ప్రపంచ రక్తదాతల

దినోత్సవం

● 18 నుంచి 60 ఏళ్లలోపు వారందరూ

రక్తదానం చేయవచ్చు

● రక్తదానం చేసే వ్యక్తి కనీసం 45 కిలోల

బరువు ఉండాలి.

● నిమిషానికి నాడి 60 నుంచి 100సార్లు

కొట్టుకోవాలి.

● రక్తపోటు సిస్టాలిక్‌ 100 నుంచి 180,

డయాస్టాలిక్‌ 50 నుంచి 100 వరకు ఉండాలి.

● హిమోగ్లోబిన్‌ శాతం 12.5గ్రాములపైన

ఉండాలి.

● నోటి ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటిగ్రేడ్‌ కంటే అధికంగా ఉండకూడదు.

● మూడు నెలలకు ఒకసారి రక్తదానం

చేయవచ్చు.

కర్నూలు(హాస్పిటల్‌): అత్యవసర సమయాల్లో రోగులకు కుటుంబ సభ్యులు, బంధువులే రక్తదానానికి వెనకడుగు వేస్తుండగా రక్తదాతలు ముందుకు వస్తున్నారు. ఎలాంటి సంబంధమూ లేకున్నా రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారుతున్నారు. కర్నూలు, ఆదోని, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు తదితర ప్రాంతాల్లో రక్తదాతలు గ్రూపుగా ఏర్పడి, రక్తం అవసరమైన వారికి అందిస్తున్నారు. కొందరు సామాజిక మాధ్యమాల ద్వారా గ్రూపులుగా ఏర్పడి రక్తదానం చేస్తున్నారు. రక్తంలోని వివిధ గ్రూపులను కనుగొన్న నోబెల్‌ అవార్డు గ్రహీత, శాస్త్రవేత్త కార్ల్‌ స్టీనర్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతి సంవత్సరం జూన్‌ 14వ తేదిన ప్రపంచ రక్తదాతల దినోత్సవంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం..

బ్లడ్‌బ్యాంకులు ఇవీ..

జిల్లాలో కర్నూలు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, ఆదోనిలోని ఏరియా హాస్పిటల్‌లో బ్లడ్‌బ్యాంకులు ఉన్నాయి. కర్నూలులో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ రక్తనిధి ఉంది. విశ్వభారతి, ఆర్‌ఆర్‌ హాస్పిటళ్లలో బ్లడ్‌ బ్యాంక్‌లు ఉన్నాయి. అక్షయ బ్లడ్‌ బ్యాంక్‌, న్యూ లైఫ్‌ బ్లడ్‌ బ్యాంక్‌, కర్నూలు బ్లడ్‌ సెంటర్‌, కేర్‌ బ్లడ్‌ సెంటర్‌, మెడిప్లస్‌ బ్లడ్‌ సెంటర్‌, పెంచికలపాడులోని విశ్వభారతి జనరల్‌ హాస్పిటల్‌, ఆదోనిలో గోపి చారిటబుల్‌ బ్లడ్‌ సెంటర్‌, ఎమ్మిగనూరులో మహాత్మా గాంధి బ్లడ్‌ బ్యాంక్‌లు పనిచేస్తున్నాయి. వీటితో పాటు ఆలూరు, పత్తికొండ, కోడుమూరు, ఓర్వకల్లు, వెల్దుర్తి, పాణ్యంలలో రక్తనిల్వ కేంద్రాలు ఉన్నాయి.

ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 14న రక్తదాతలు, రక్తదానానికి ప్రోత్సహించిన వారికి, యువజన సంఘాలకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో 50 మందికి సన్మానం చేస్తాం. కర్నూలులో ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని రక్తనిధిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అనంతరం అన్ని రక్తనిధుల్లో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించనున్నాం. రక్తదానంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. రక్తదానం చేయడానికి యువత ముందుకు వచ్చేలా చేసేందుకు కళాశాలల్లో రెడ్‌రిబ్బన్‌ క్లబ్‌లు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నాం. – డాక్టర్‌ ఎల్‌. భాస్కర్‌,

జిల్లా అడిషనల్‌ డీఎంహెచ్‌వో, కర్నూలు

మా స్వస్థలం అనంతపురం. ప్రస్తుతం కర్నూలులోని బాలాజీనగర్‌లో నివాసం ఉంటున్నాను. నాకు 39 సంవత్సరాల వయస్సు. బి పాజిటివ్‌ రక్తం గ్రూపు. మొదట్లో సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌గా పనిచేశాను. ఇప్పుడు కర్నూలులో ఓ ప్రైవేటు సంస్థలో జాబ్‌ చేస్తున్నాను. నా భార్య గర్భవతిగా ఉన్న సమయంలో రక్తం అవసరమై చాలా ఇబ్బంది పడ్డాను. దీనికితోడు ప్రమాదాల్లో గాయపడిన వారు రక్తం కోసం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నాకు 22 ఏళ్ల వయస్సున్నప్పుడు మొదటిసారి రక్తదానం చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు 89 సార్లు రక్తం ఇచ్చాను. నాతో పాటు స్నేహితులనూ ప్రోత్సహిస్తున్నాను.

– డి.వారాధిరెడ్డి, రక్తదాత, కర్నూలు

సంవత్సరం లక్ష్యం లక్ష్యసాధన నిర్వహించిన

క్యాంపులు

2021-2022 22,720 48,135 99

2022-2023 22,720 51,076 216

2023-2024 22,720 50,123 228

2024-2025 22,720 52,843 177

2025-2026 22,720 56,393 242

2026 ఇప్పటివరకు 3,786 5,165 23

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement