● కర్నూలు జిల్లాలో 16, నంద్యాల జిల్లాలో 10 మండలాల్లో వర్షపాతం
మండలం వర్షపాతం(మి.మీ)
ఆదోని 36.4
ఓర్వకల్ 15.2
హొళగుంద 14.4
కల్లూరు 11.6
ఎమ్మిగనూరు 10
వెల్దుర్తి 9.8
మహానంది 9.6
గూడూరు 9.2
పగిడ్యాల 8.2
జూపాడుబంగ్లా 7.8
కర్నూలు(అగ్రికల్చర్): నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉమ్మడి కర్నూలు జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు తేలికపాటి నుంచి ఒకమోస్తరు వర్షాలు కురిశాయి. కర్నూలు జిల్లాలో 16 మండలాలు, నంద్యాల జిల్లాలో 10 మండలాల్లో వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లాలో వర్షం తేలిక పాటికే పరిమితమైంది. అయితే కర్నూలు నగరంలో భారీ వర్షం కురిసింది. కర్నూలు రూరల్‌లో 56.2 మి.మీ, కర్నూలు అర్బన్‌లో 48.6 మి.మీ వర్షపాతం నమోదైంది. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. కాలువలు పొంగిపొర్లాయి. జిల్లా మొత్తంగా సగటున 9 మి.మీ వర్షం కురిసింది. జూన్ నెల సాధారణ వర్షపాతం 77.7 మి.మీ ఉండగా ఇప్పటి వరకు 46.1 మి.మీ వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లా మొత్తంగా సగటున 1.7 మి.మీ వర్షం కురిసింది. నంద్యాల జిల్లాలో జూన్ నెల సాధారణ వర్షపాతం 77 మి.మీ కాగా ఇప్పటి వరకు 58.4 మి.మీ వర్షపాతం నమోదైంది. ఉమ్మడి జిల్లాలో ఎల్‌నినో ప్రభావంతో తొలకరి నిరాశాజనకంగా సాగుతోంది.


