నమో నారసింహా | - | Sakshi
Sakshi News home page

నమో నారసింహా

Jun 14 2026 7:16 AM | Updated on Jun 14 2026 7:16 AM

ఆళ్లగడ్డ: నవనారసింహ స్వాములు కొలువైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అహోబిలం శనివారం భక్తులతో కిక్కిరిసి పోయింది. ఎగువ, దిగువ క్షేత్రాలతో పాటు పావన క్షేత్రం తెల్లవారు జాము నుంచే భక్తులతో కిటకిటలాడింది. స్వామి అమ్మవార్లకు పూజలు నిర్వహించి తలనీలాలు సమ ర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకున్న భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా భక్తులు భక్తి పారవశ్యంతో చేసిన గోవింద నామస్మరణతో అహోబిల క్షేత్రం మార్మోగింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement