కర్నూలు(అర్బన్): జిల్లాలో మాల గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (మాల్గోవా)ను బలోపేతం చేసేందుకు కృషి చేయనున్నట్లు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వీపీ సోమన్న, డాక్టర్ వై. రాజశేఖర్ తెలిపారు. స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. ఇటీవల పీఆర్ డీఈఈ నుంచి ఈఈగా పదోన్నతి పొందిన భాస్కర్‌తో పాటు ప్రిన్సిపాళ్లుగా పదోన్నతి పొందిన మాదన్న, నాగన్నను ఘనంగా సన్మానించారు. వారు మాట్లాడుతూ.. మాల్గోవాను రాష్ట్రంలో బలోపేతం చేసే ప్రక్రియలో ఇటీవల విజయవాడలో భారీ సభను నిర్వహించారన్నారు. ఈ సభకు విశ్రాంత ఐఏఎస్ విజయకుమార్‌తో పాటు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అనేక మంది ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరై దిశానిర్దేశం చేశారన్నారు. అందరి సలహాలు, సూచనల మేరకు మాల్గోవాను బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. పీఆర్ డీఈఈలు హెచ్‌డీ ఈరన్న, బండారు శ్రీనివాసులు, అధ్యాపకులు ఓబులేసు, నాగన్న, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.


