టిప్పర్‌ను ఢీకొన్న ట్రావెల్‌ బస్సు | - | Sakshi
Sakshi News home page

టిప్పర్‌ను ఢీకొన్న ట్రావెల్‌ బస్సు

Jun 13 2026 7:32 AM | Updated on Jun 13 2026 7:32 AM

ఐదుగురికి గాయాలు

కొలిమిగుండ్ల: స్థానిక జమ్మలమడుగు రోడ్డులో శుక్రవారం రాత్రి టిప్పర్‌ను ట్రావెల్‌ బస్సు ఢీకొనడంతో ఐదుగురు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. చాగలమర్రికి చెందిన జాకీర్‌ తన పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించేందుకు ట్రావెల్‌ బస్సు అద్దెకు తీసుకొని బంధువులతో కలిసి అనంతపురం జిల్లా తలారిచెరువు సమీపంలోని హాజివలి దర్గాకు బయలుదేరారు. మార్గం మధ్యలో కొలిమిగుండ్లలోని జమ్మలమడుగు జంక్షన్‌ సమీపంలో పెట్రోల్‌ బంక్‌ వద్ద ముందు వెళుతున్న టిప్పర్‌ను బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. బస్సులో 35 మందికి పైగా ఉన్నారు. డోర్‌తో పాటు ముందు భాగం పూర్తిగా దెబ్బతినడంతో బయటకు వచ్చేందుకు వీలు పడలేదు. స్థానికుల సాయంతో అతి కష్టం మీద ఇరుక్కుపోయిన డోర్‌, ఇతర భాగాలను తొలగించడంతో బస్సులో ఉన్న వాళ్లను బయటకు పంపించారు. సీఐ రమేష్‌బాబు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement