కరకట్ట కందకంలో పడి మృతి | - | Sakshi
Sakshi News home page

కరకట్ట కందకంలో పడి మృతి

Jun 15 2026 12:11 AM | Updated on Jun 15 2026 12:11 AM

ఖమ్మంక్రైం: వరద ముంపు రాకుండా మున్నేటి వద్ద నిర్మిస్తున్న కరకట్ట కందకంలో ప్రమాదవశాత్తు పడిన ఓ యువకుడు మతి చెందాడు. ఖమ్మం సుందరయ్యనగర్‌ ప్రాంతానికి చెందిన వనమాల కృష్ణ చిన్నకుమారుడు జయశంకర్‌ (21) ఇంటర్‌ తర్వాత ఇంటి వద్దే ఉంటున్నాడు. ఆయన శనివారం మధ్యాహ్న భోజనం చేశాక బయటకు వెళ్తున్నానని తల్లి, సోదరుడికి చెప్పి బయలుదేరాడు. అయితే, రాత్రి వరకు తిరిగి రాకపోవడం, సెల్‌ఫోన్‌ కూడా ఇంట్లోనే ఉండడంతో స్నేహితుల వద్ద ఆరా తీసినా ఫలితం కానరాలేదు. ఈ మేరకు ఆదివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్తుండగా, మున్నేటి కరకట్ట కోసం తవ్విన 20 అడుగుల లోతు కందకంలో జయశంకర్‌ మృతదేహం తేలుతోందన్న సమాచారంతో వెళ్లిన కుటుంబీకులు కన్నీరమున్నీరయ్యారు. కందకంలో చేతులు కడుక్కోవటానికి వెళ్లిన ఆయన ప్రమాదవశాత్తు పడగా, ఈత రాకపోవడంతో మృతి చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ మేరకు అన్నం ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు సహకారంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించగా, జయశంకర్‌ తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఖమ్మం త్రీటౌన్‌ సీఐ మోహన్‌బాబు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement