పాల్వంచరూరల్: శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) అమ్మవారికి ఆదివారం అర్చకులు విశేష పూజ లు నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసు పు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈఓ ఎన్.రజనీకుమారి, అర్చకులు పద్మనాభశర్మ, రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.
వికాసం పాఠశాలల్లో
ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వికాసం పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. చెవిటి, మూగ, దృష్టిలోపం, ఇతర వికలాంగత కలిగిన బాలబాలికలు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పాఠశాలలో ఉచిత విద్య, వసతి, భోజనంతోపాటు హియరింగ్ ఎయిడ్, స్పీచ్ థెరపీ, కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన 7 నుంచి 16 ఏళ్ల వయస్సు గల ప్రత్యేక అవసరాలున్న పిల్లలను చేర్పించాలని, వివరాలకు 93811 81407, 6303 947240 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
రాత పరీక్షకు
642 మంది హాజరు
రుద్రంపూర్: సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 17 జూనియర్ కెమిస్ట్ /టెక్నికల్ ఇన్‌స్పెక్టర్ ఇంటర్నల్ పోస్టులకు ఆదివారం కొత్తగూడెం సింగరేణి మహిళా కళాశాలలో రాత పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 642 మంది అభ్యర్థులు హాజరుకాగా, కేంద్రాన్ని జీఎం పర్సనల్ (ఈఈ అండ్ రిక్రూట్‌మెంట్) జీఎం ఏజే మురళీధర్ పర్యవేక్షించారు.


