మా నాన్న ఎన్.ఎస్.రాయుడు న్యాయవాది కాగా, అమ్మ లక్ష్మీదేవి రైల్వే శాఖలో ఆఫీస్ సూపరింటెండెంట్‌గా పనిచేశారు. దీంతో సికింద్రాబాద్‌లోని రైల్వే పాఠశాలలో నా చదువు కొనసాగింది. అమ్మ ఉదయం క్యారేజీ రెడీ చేస్తే, ఆ తర్వాత స్కూల్‌కు వెళ్లే వరకు నాన్న వెంట ఉండేవారు. ప్రాథమిక తరగతులకు ఆటోలో వెళ్లగా, ఆ తర్వాత స్నేహితులతో కలిసి సైకిళ్లపై స్కూల్‌కు వెళ్లా. అమ్మానాన్న సూచనలతో చదువు, క్రమశిక్షణలో ముందు నిలుస్తూ చదువులో స్నేహితులతో పోటీ పడేవాడిని. ఇంజనీరింగ్ అయ్యాక ఎస్‌బీఐ, ఇంటెలిజెన్స్ శాఖలో ఉద్యోగాలు వచ్చాయి. కానీ రైతులకు సేవలందించాలనే తపనతో డీసీసీబీ సీఈఓ పోస్టు ఎంచుకున్నా.
– ఎన్.వెంకటఆదిత్య, డీసీసీబీ సీఈఓ


