నాన్న సైకిల్‌పై నేను, చెల్లి, తమ్ముడు | - | Sakshi
Sakshi News home page

నాన్న సైకిల్‌పై నేను, చెల్లి, తమ్ముడు

Jun 15 2026 12:11 AM | Updated on Jun 15 2026 12:11 AM

నాన్న సైకిల్‌పై నేను, చెల్లి, తమ్ముడు

మాది సింగరేణి మండలం గేటుకారేపల్లి. నాన్న భూక్యా చిట్టిబాబు పోస్టుమాస్టర్‌గా పనిచేస్తూనే వ్యవసాయం చేసేవారు. అమ్మానాన్న చిట్టిబాబు – రాధకు నేను మొదటి కుమార్తెను. ఆ తర్వాత చెల్లె సుజాత, తమ్ముడు అరుణ్‌ ఉన్నారు. చెల్లి, తమ్ముడితో కలిసి సిద్ధమయ్యాక నాన్న సైకిల్‌పై తీసుకెళ్లి స్కూల్‌లో దింపేవారు. శ్రద్ధగా చదువుతూ ఏ రోజు హోం వర్క్‌ ఆరోజు చేసేవాళ్లం. ఎనిమిదో తరగతికి వచ్చాక కారేపల్లి హైస్కూల్‌కు వెళ్లే మార్గంలో బుగ్గవాగు ఉండడంతో నాన్న భద్రాచలం ఏపీఆర్‌ఎస్‌లో చేర్పించారు. ఇంటర్‌ తర్వాత అశ్వారావుపేటలో ఏజీబీఎస్సీ, ఆపై ఎమ్మెస్సీ పూర్తిచేశా. నాన్న ఆశయం మేరకు దమ్మపేట ఏఓగా గెజిటెడ్‌ ర్యాంక్‌ ఉద్యోగం సాధించా. ప్రస్తుతం ఖమ్మం వ్యవసాయ సాంకేతిక సంస్థ (ఆత్మ) పీడీగా కొనసాగుతున్నా.

– బి.సరిత, ఆత్మ ప్రాజెక్టు డైరెక్టర్‌, ఖమ్మం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement