అలా.. మొదలైంది! | - | Sakshi
Sakshi News home page

అలా.. మొదలైంది!

Jun 15 2026 12:11 AM | Updated on Jun 15 2026 12:11 AM

ఆనందంగా ఉండేది..

అడ్డంకులను అధిగమిస్తూ

విద్యాభ్యాసం

కుటుంబీకుల ప్రోత్సాహం,

గురువుల బోధనతో ఉన్నతస్థానాలకు..

పదో తరగతి వరకు నా చదువు ఐదు పాఠశాలల్లో కొనసాగింది. ఒకటో తరగతి ప్రకాశం జిల్లా మార్కాపురంలో, 2, 3వ తరగతులు కర్నూలు జిల్లా కోయిలకుంట్ల, 4, 5వ తరగతి నంద్యాల జిల్లా రేవనూరు, ఆరో తరగతి కడపలో పూర్తిచేయగా, 7 నుంచి 10వ తరగతి వరకు కర్నూలు జిల్లా నందికొట్కూరులో చదివా. ఏటా వేసవి సెలవుల్లో ఆనందంగా గడిపేది. మళ్లీ కొత్త తరగతిలో మొదటి రోజు వెళ్లాలంటే కాస్త బెరుకు కంటే స్నేహితులు కలుస్తారన్న ఆనందమే ఎక్కువగా ఉండేది. ఆ రోజులు తలుచుకుంటే ఇప్పటికీ సంతోషం అనిపిస్తుంది. స్నేహితులందరం కలిసి నడిచి స్కూల్‌కి వెళ్లేవాళ్లం. విద్యాభ్యాసమంతా బాలికల స్కూళ్లలోనే కొనసాగింది. స్కూల్‌లో చదివేటప్పుడు ఎన్‌సీసీలో ఉత్సాహంగా ఉండేదాన్ని. ఉపాధ్యాయులు చాలా శ్రద్ధ తీసుకుని చదువు చెప్పేవారు.

– డాక్టర్‌ మట్టా రాగమయి, సత్తుపల్లి

వేసవి సెలవుల అనంతరం సోమవారం నుంచి నూతన విద్యా సంవత్సరం మొదలవుతోంది. ఈ క్రమాన పిల్లలు పాఠశాలలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు ఈసారే పాఠశాల బాట పట్టనుండగా.. ఇంకొందరు కొత్త తరగతిలోకి వెళ్లనున్నారు. ఈ క్రమాన ఉమ్మడి జిల్లాలోని పలు శాఖల ఉన్నతాధికారులను వారి ‘బడి’ జ్ఞాపకాలపై ఆరా తీయగా

ఆ సంగతులన్నీ ఆసక్తిగా వివరించారు.

–ఖమ్మంమయూరిసెంటర్‌ / ఖమ్మంవ్యవసాయం / సత్తుపల్లిటౌన్‌ / భద్రాచలంఅర్బన్‌

‘బడి బాట’ జ్ఞాపకాల్లో అధికారులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement