ఎర్రుపాలెం: జమలాపురంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 29న మహా కుంభాభిషేకం ఉత్సవాలు మొదలుకానున్నాయి. ఇందులో భాగంగా ప్రతిష్ఠించనున్న ధ్వజ స్తంభాలకు ఆదివారం అర్చకులు, అధికారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ కె.జగన్‌మోహన్‌రావు మాట్లాడుతూ మహా కుంభాభిషేకం, ధ్వజ స్తంభాల ప్రతిష్ఠా పూజలకు గ్రామస్తులు, భక్తులు సహకరించాలని కోరారు. ఈకార్యక్రమంలో వ్యవస్థాపక ధర్మకర్త ఉప్పల విజయదేవశర్మ, ప్రధాన అర్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, జూనియర్ అసిస్టెంట్ కృష్ణప్రసాద్, దాత తుళ్లూరు కోటేశ్వరరావుతో పాటు అంకసాల శ్రీనివాసరావు, ఎల్.పీ.నారాయణరెడ్డి నన్నపనేని రామారావు, సుకవాసి రమేష్, వేమిరెడ్డి అంకిరెడ్డి, వీరమాచినేని జగదీష్ బాబు, భూక్యా బాలాజీ, చొప్పరపు శ్రీనివాసరావు, మిర్యాల శ్యామ్‌ప్రసాద్, మేడా భానుప్రతాప్ పాల్గొన్నారు.
వసతిగృహాలు రెడీ..
ఖమ్మంమయూరిసెంటర్: వేసవి సెలవులు ముగియనుండడంతో సోమవారం కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాల్లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గత రెండు రోజులుగా వంట గదులు, విద్యార్థులు బస చేసే గదులు, ఆవరణను శుభ్రం చేయిస్తున్నారు. అంతేకాక వంట సామగ్రి, టేబుళ్లు,, గదులను కడిగించారు. అయితే, సోమవారం, మంగళవారం కాకుండా ఎక్కువ మంది విద్యార్థులు బుధవారమే హాస్టళ్లకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.


