హెల్త్‌ కార్డుల జారీకి కృషి చేస్తా | - | Sakshi
Sakshi News home page

హెల్త్‌ కార్డుల జారీకి కృషి చేస్తా

Jun 15 2026 12:11 AM | Updated on Jun 15 2026 12:11 AM

● హామీల అమలుపై ప్రభుత్వం స్పందించాలి ● పీఆర్‌టీయూ సమావేశంలో ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి

ఖమ్మం సహకారనగర్‌: ఉద్యోగ, ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డుల విషయంలో ఆందోళన అవసరం లేదని.. సీఎం, ఉన్నతాధికారులతో చర్చించి త్వరలోనే హెల్త్‌ కార్డుల జారీకి కృషి చేస్తానని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి వెల్లడించారు. ఖమ్మంలోని పీఆర్‌టీయూ కార్యాలయంలో ఆదివారం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. హెల్త్‌ కార్డుల విధివిధానాల రూపకల్పన, జారీపై ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తోందన్నారు. అయితే, ఈనెల 2వ తేదీ నాటికి పీఆర్సీ, డీఏలపై అనుకూల నిర్ణయం వస్తుందని ఆశించినా ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. ఇకనైనా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ ప్రకటించకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాక 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్‌, సీపీఎస్‌ రద్దుపై నిర్ణయం తీసుకోవాలని శ్రీపాల్‌రెడ్డి కోరారు. అనంతరం కాంగ్రెస్‌ నాయకుడు తుమ్మల యుగంధర్‌ మాట్లాడగా, పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కట్టా శేఖర్‌, ఆర్‌.రంగారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఖాదర్‌ అలీ, పీఆర్‌టీయూ బాధ్యులు యలమద్ది వెంకటేశ్వర్లు, కె.వెంకటనర్సయ్య, జి.విజయ్‌, అమృత్‌కుమార్‌, ఆర్‌.బ్రహ్మారెడ్డి, చిత్తలూరి ప్రసాద్‌, కే.వీ.రమణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement