● రంగు మారింది.. | - | Sakshi
Sakshi News home page

● రంగు మారింది..

Jun 15 2026 12:11 AM | Updated on Jun 15 2026 12:11 AM

● రంగు మారింది..

గత ఏడాది పాఠశాలలు తెరిచిన రోజే విద్యార్థులకు యూనిఫామ్‌ పంపిణీ చేశారు. కానీ ఈసారి ఇప్పటివరకు యూనిఫామ్‌ క్లాత్‌ రాకపోవడంతో అస్పష్టత నెలకొది. అయితే, యూనిఫామ్‌ రంగులు, డిజైన్‌ మార్చాలనే ప్రభుత్వ ఆలోచనతో ఈ ఆలస్యం జరిగిందని తాజాగా వెల్లడించారు. ఇందులో భాగంగా ఒకటి నుంచి ఐదో తరగతి వరకు బాలురకు లైట్‌ బ్లూ షర్ట్‌, డార్క్‌ బ్లూ షార్ట్‌, 6 నుంచి 12వ తరగతి వరకు బాలురకు అదే రంగు షర్ట్‌, ప్యాంట్‌ అందిస్తారు. ఇక 1 నుంచి 3వ తరగతి వరకు బాలికలకు బాడీ ఫ్రాక్‌తోపాటు షర్ట్‌, 4, 5వ తరగతులకు షర్ట్‌, స్కర్ట్‌, 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బాలికలకు పంజాబీ డ్రస్‌తోపాటు వెస్ట్‌ కోట్‌ సమకూర్చారు. త్వరలోనే జిల్లాకు క్లాత్‌ చేరాక యూనిఫామ్‌ కుట్టే బాధ్యతలను గతంలో మాదిరిగానే గ్రామీణ స్థాయిలో స్వయం సహాయక సంఘాలకు, మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ పరిధిలో మెప్మా సిబ్బందికి అప్పగించనున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement