మాది జమ్మూకశ్మీర్. పంజాబ్ రాష్ట్రానికి సరిహద్దుగా మాగ్రామం ఉండేది. నా బాల్యం, చదువు అంతా గ్రామీణ ప్రాంతాల్లోనే సాగింది. నాన్న ప్రభుత్వ టీచర్ కావడంతో ఆయన పనిచేసే గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో చదివా. ఏడో తరగతి వరకు పాఠశాలకు వెళ్లడం అంత ఆసక్తిగా ఉండేది కాదు. ఆ తర్వాత చదువుపై ఇష్టం పెరగడంతో ప్రతిరోజు స్కూల్‌కు వెళ్లడం.. చదవడంపై దృష్టి పెట్టా. మా చిన్నతనంలో పాఠశాలలకు ఎన్ని రోజులు సెలవులు ఇస్తే అన్ని రోజులకు సరిపడా హోంవర్క్ ఇచ్చేవారు. ఒక్కో హోంవర్క్ పూర్తి చేయడానికి రోజుల సమయం పట్టేది. దీంతో సెలవులన్నీ హోంవర్క్‌కే సరిపోయేవి. నేను చదివిన స్కూళ్లలో ఇంగ్లిష్ ఒక సబ్జెక్ట్‌గా మాత్రమే ఉండడం ఆ భాషపై పట్టు సాధించేందుకు చాలా కష్టపడ్డా. పైతరగతులకు వెళ్తున్నాకొద్దీ పట్టు సాధించా. మొత్తంగా పాఠశాల విద్య పూర్త య్యేలోగా నాలుగు భాషలు నేర్చుకున్నా. – అభిషేక్ అగస్త్య, కమిషనర్, కేఎంసీ


