భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం ధనియాలపాడులో జన్మించిన నాకు చదువులో మార్గదర్శకుడు అన్న వెంకటేశ్వర్లు. మా గ్రామంలో 3వ తరగతి వరకు ఉండేది. ఆ తర్వాత నాలుగు కి.మీ. అన్నతో కలిసి నడుస్తూ వాగులు దాటి స్కూల్‌కు వెళ్లేవాడిని. అలా మా గ్రామం నుంచి 15మంది ఉండేవాళ్లు. తిరిగి వచ్చేటప్పుడు మధ్యలో చెట్ల కింద కూర్చొని చదువుకునేవాళ్లం. అమ్మనాన్నది వ్యవసాయ కుటుంబమైనా మమ్ముల్ని చదువులో ప్రోత్సహించేవాళ్లు. అయితే, స్కూల్ దూరం కావడంతో ఇబ్బందిగా ఉందని కిన్నెరసాని గురుకులంలో చేర్పించారు. అక్కడ పదో తరగతి వరకు, భద్రాచలంలో ఇంటర్ పూర్తి చేసి అశ్వారావుపేటలో ఏజీబీఎస్సీ చదివాక ఉద్యోగం సాధించా. మా అన్నయ్య వెంకటేశ్వర్లు ఉన్నత విద్య పూర్తిచేసి సింగరేణిలో జీఎంగా పనిచేస్తున్నారు. అమ్మానాన్న ప్రోత్సాహంతో హాస్టళ్లలో ఉండి చదువుకోవడంతో ఈ స్థాయికి చేరాం.
– ధనసరి పుల్లయ్య, డీఏఓ, ఖమ్మం


