ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో.. | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో..

Jun 15 2026 12:11 AM | Updated on Jun 15 2026 12:11 AM

ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో..

మాది సూర్యాపేట జిల్లా గోపాలపురం. వ్యవసాయ కుటుంబానికి చెందిన అమ్మానాన్నలు కృష్ణారెడ్డి – పద్మకు నేను, అన్నయ్య సంతానం. 10వ తరగతి వరకు తెలుగు మీడియంలోనే చదు వుతూ అన్నయ్యతో పాటు స్కూల్‌కి వెళ్లగా, ఉపాధ్యాయులు సత్యనారాయణ, సైదులు ప్రభావం నాపై ఎంతో ఉంది. ఎనిమిదో తరగతి నుంచి ఊరికి ఐదు కి.మీ. దూరాన పాఠశాలకు సైకిల్‌పై వెళ్లేవాళ్లం. పదో తరగతి తర్వాత సివిల్స్‌ను లక్ష్యంగా ఎంచుకున్నప్పటికీ నాన్న కోరికతో ఇంటర్‌లో బైపీసీ ఇంగ్లిష్‌ మీడియం చదివి, ఎంబీబీఎస్‌ పూర్తిచేశా. ఆపై పీజీ అనంతరం 2018లో ప్రభుత్వ వైద్యుడిగా ఎంపి కయ్యా. తొలి పోస్టింగ్‌ భద్రాచలంలో రాగా, ఇక్కడే సూపరింటెండెంట్‌ స్థాయికి చేరా. మా ఊరిలో మొదటి వైద్యుడిని నేనే. నన్ను ప్రోత్సహించిన నాన్న, అన్నయ్యతో పాటు ఉపాధ్యాయులకు రుణపడి ఉంటా.

– డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి,

భద్రాచలం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement