ఖమ్మంమయూరిసెంటర్: గ్రామ దీపికల సమస్యలను తమ ప్రభుత్వంలో ఐఎన్‌టీయూసీ ద్వారా పరిష్కరించుకుంటామని నాయకులు స్పష్టం చేశారు. ఐఎన్‌టీయూసీ జిల్లాఅధ్యక్షుడు కొత్తా సీతారాములు అధ్యక్షతన శనివారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో శనివారం వీఓఏల జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి మాట్లాడుతూ.. వీఓఏల కనీస వేతనం, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత వంటి దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సమస్యలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లి వీఓఏలకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. అనంతరం సీతారాములు మాట్లాడుతూ.. కార్మిక లోకానికి అండగా నిలుస్తామని, వీఓఏల సమస్యల పరిష్కారంలో ముందు నిలుస్తామని చెప్పారు. వీఓఏల రాష్ట్ర అధ్యక్షురాలు అరుణ, కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు సౌజన్య, నాయకులు నరాల నరేష్ మోహన్‌నాయుడు, పద్మ, తలారి రాములు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ కుట్రలను తిప్పికొట్టాలి..
సత్తుపల్లి: ‘సర్’పేరుతో ఓట్ల తొలగింపునకు బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ శ్రేణులు అప్రమత్తంగా వ్యవహరించాలని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ, ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి సూచించారు. సత్తుపల్లిలో శనివారం జరిగిన బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణలో టీపీసీసీ జనరల్ సెక్రటరీ, నియోజకవర్గ కన్వీనర్ రవిచంద్రతో కలిసి వారు మాట్లాడారు. బీఎల్‌ఏల అప్రమత్తంగా ఉంటూ ఓటర్లకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రతీ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓటు కోల్పోకుండా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని చెప్పారు. అనంతరం కాంగ్రెస్ సత్తుపల్లి, వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండల అధ్యక్షులుగా నియమితులైన భీమిరెడ్డి సుబ్బారెడ్డి, కాసర్ల చంద్రశేఖర్‌రెడ్డి, పంది వెంకటేశ్వరరావు, పోట్రు అర్జున్‌రావు, గొడుగునూరి లక్ష్మీరెడ్డితో పాటు కల్లూరు, సత్తుపల్లి పట్టణ అధ్యక్షులు ఎస్.కే.ఉస్మాన్, గాదె చెన్నకేశవరావుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు డాక్టర్ మట్టా దయానంద్, దొబ్బల సౌజన్య, ఎం.డీ.రెహానా కమల్‌పాషా, మోహన్‌నాయక్, గంగిశెట్టి ప్రసాద్, చల్లగుండ్ల కృష్ణయ్య, వంకాయలపాటి వెంకటేశ్వరరావు, దోమ ఆనంద్, బాగం నీరజ, బొంతు సుమలత, నారాయణవరపు శ్రీనివాస్, చల్లగుళ్ల నర్సింహారావు, ఉడతనేని అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ,
ఎమ్మెల్యే రాగమయి


