డిప్యూటీ సీఎంకు కుంభాభిషేకం ఉత్సవాల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

డిప్యూటీ సీఎంకు కుంభాభిషేకం ఉత్సవాల ఆహ్వానం

Jun 13 2026 7:32 AM | Updated on Jun 13 2026 7:32 AM

ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 29వ తేదీ నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు ధ్వజ ప్రతిష్ఠ సహిత మహా కుంభాభిషేకం ఉత్సవాలు జరగనున్నాయి. ఈమేరకు ఉత్సవాలకు హాజరుకావాలని కోరుతూ అధికారులు, అర్చకులు శుక్రవారం హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు ఆహ్వాన పత్రికలు అందజేశారు. అలాగే, వారికి స్వామి వారి ప్రసాదం అందజేసి సన్మానించారు. దేవాదాయ కమిషనర్‌ హన్మంతరావు, ఆలయ ఈఓ కె.జగన్మోహన్‌రావు, ప్రధాన అర్చకుడు ఉప్పల శ్రీనివాసశర్మ, ఉద్యోగులు కృష్ణప్రసాద్‌, వంశీ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement